mega star chiranjeevi supports revanth reddy govt fight against drugs cause | Chiru: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా చిరంజీవి
chiranjeevi
Political News

Chiru: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా చిరంజీవి

CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నది. డ్రగ్స్ అరికట్టడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, డ్రగ్స్ పేరు ఎత్తితే కాళ్లు చేతులు వణకాలి అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదని, డ్రగ్స్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ బ్యూరో కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని ఆ తర్వాత వెల్లడించారు. ఈ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. డ్రగ్స్ వల్ల కలిగే విపరిణామాలపై అవగాహన తీసుకురావడానికీ చర్యలు చేపట్టింది.

తాజాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి కూడా తన వంతుగా ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా అవగాహన కోసం ఓ యాడ్‌లో కనిపించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను ఆ యాడ్‌లో చిరంజీవి వివరించారు. డ్రగ్స్ తీసుకుంటే జీవితాలు ధ్వంసమైపోతాయని హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు లేదా కొనుగోలు చేసినట్టు తెలిస్తే వెంటనే నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 8712671111 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని చెప్పారు. ఇది డ్రగ్స్ తీసుకున్నవారిని శిక్షించడానికి కాదని, డ్రగ్స్ నుంచి వారిని విముక్తి చేయడానికేనని చెప్పారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తానూ భాగమవుతున్నానని వివరించారు. అందరూ భాగస్వాములై రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలాలని పిలుపు ఇచ్చారు.

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!