Lakshmi | కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. కిరణ్ రాయల్ తన వద్ద కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. నిన్న కిరణ్ రాయల్ (Kiran Royal) మీద జనసేన పార్టీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రోజు సోమవారం లక్ష్మీ ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆడియో రికార్డు బయట పెట్టింది. ఆమె ప్రెస్ మీట్ అయిపోగానే ప్రెస్ క్లబ్ బయటనే ఆమెను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జైపూర్ లో ఆమెపై ఆర్థిక నేరాల కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also:పృథ్వీ మాటలతో నాకు సంబంధం లేదు.. విశ్వక్ సేన్ ఝలక్..!
2021లో లక్ష్మీతో పాటు అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ అలియాస్ ఘనిపై జైపూర్, చంద్వాజీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీరిపై 419, 420, 66C, 66D, 120-B, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో పోలీసులు. ఈ కేసుల్లో అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి లక్ష్మీ తప్పించుకుని తిరుగుతున్నారు.
ఇన్ని రోజులకు కిరణ్ రాయల్ వ్యవహారంతో ఆమె సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించడంతో జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో హాజరు పరిచి, తిరిగి జైపూర్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది.