Ktr Bhaimsa attack
Politics

KTR: కేటీఆర్ ఓటు చెల్లదా?

– కేటీఆర్‌కు ఈసీ షాక్
– ఓటింగ్ సమయంలో మాట్లాడిన మాటలపై కాంగ్రెస్ అభ్యంతరం
– ఈసీకి ఫిర్యాదు చేసిన నిరంజన్
– స్పందించిన ఎన్నికల సంఘం
– యాక్షన్ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశం

Election Commission: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో నందిని నగర్‌లో ఆయన ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈసీ తాజాగా స్పందించింది. వెంటనే ఈ అంశంపై యాక్షన్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లేదా జిల్లా ఎన్నికల అధికారికి మెమో జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధం అవుతున్నది.

నందిని నగర్‌లో కేటీఆర్ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ సాధించిన నేతకు ఓటు వేశాను. మీరందరు కూడా ఓటు వేయాలని కోరుతున్నాను’ అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని కోరారు.

ఎన్నికల సంఘం దర్యాప్తులో వాస్తవాలు తెలిస్తే కేటీఆర్ ఓటు చెల్లదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజంగానే కేటీఆర్ వేసిన ఓటు చెల్లకుండా పోతుందా? అనేది తెలియాలంటే ఈసీ దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. పోలింగ్ రోజున బీజేపీ నాయకురాలు మాధవీలత, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నాయకులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా కేటీఆర్‌పైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్