Ktr Bhaimsa attack
Politics

KTR: నయవంచనకు ప్రతిరూపం

– ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది
– ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది
– రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసేలా హస్తం తీరు
– కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

BRS Party: బీఆర్ఎస్ నుంచి వలసలు జోరందుకోవడంతో ఆపార్టీలో ఆందోళన నెలకొంది. ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి ఉండడంతో, వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్‌పై ఆపార్టీ నేతలు మండిపడుతున్నారు. ఓ వైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని ఫైరయ్యారు కేటీఆర్. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. పౌర, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణిచి వేస్తూ 49 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని, ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే ఆ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూనే ఉందన్నారు. ‘‘ఓ వైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్‌లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకొని ప్రదర్శన చేస్తారు. మరోవైపు అదే పార్లమెంట్‌కు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ల పార్టీ ఆఫీస్‌లో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు’’ అంటూ విమర్శలు చేశారు.

ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో, అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బ తీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోందని అన్నారు కేటీఆర్. ఇక, ఫిరాయింపులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి భయంలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, డిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని గమనించారని చెప్పారు. అందుకే, రేవంత్ రెడ్డి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీతోనే మొదలయ్యాయని, మేనిఫెస్టోలో ఇలాంటివి ఉండకూడదని, పెట్టారని, కానీ, దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే, న్యాయ పరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ, నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడం మూలంగా బీఆర్ఎస్‌ను బలహీనపరచొచ్చని కలలు కంటున్నారని అన్నారు. అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శలు చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!