ktr slams congress govt citing attack on police in miyapur incident | KTR: శాంతి భద్రతల వైఫల్యం
KTR
Political News

KTR: సర్కారు ఫెయిల్

– రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు
– మియాపూర్ ఘటనపై కేటీఆర్ ట్వీట్

Miyapur: రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తమ పాలనలో శాంతి భద్రతలకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నదని, కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జత చేశారు. మియాపూర్‌లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఆక్రమించుకోవాలనుకున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. గుడిసెలు వేసుకోవడానికి సుమారు రెండు వేల మంది వరకు వచ్చినట్టు తెలిసింది. వారు పోలీసులపై ఎదురుతిరిగారు. రాళ్ల దాడి చేయడంతో పోలీసులు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

ప్రస్తుతం మియాపూర్, చందానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ సీపీ అవినాశ్ మొహంతీ ఉత్తర్వులు జారీ చేశారు. 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!