ktr viral coments
Politics

Hyderabad:కేటీఆర్ ను ఆడుకున్న నెటిజన్స్

ktr fires on congress telangana movement supressed sonia gandhi:

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భవ వేడుకల వేళ కేటీఆర్ కు ఊహించని విధంగా నెటిజన్స్ నుంచి ట్రోలింగ్స్ వచ్చాయి. ఎక్స్ వేదికగా తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పబ్లిక్ ను ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వానతో విరుచుకుపడ్డారు కేటీఆర్. అసలు అమరుల స్తూపం ఎవరివలన నిర్మించాల్సి వచ్చింది? 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని , హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరు మందిని బలితీకున్నది కాంగ్రెస్ కాదా? 1969-71 తొలి దశ ఉద్యమంలో దాదాపు 370 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 1971 అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో 1/14 సీట్లలో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని కనుమరుగు చేసింది ఎవరు? మొదటినుంచి తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అప్రజాస్వామిక విధానాలను తెలంగాణలో అమలుచేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ? కాంగ్రెస్ ప్రభుత్వం.. అంటూ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు? అని నెటిజన్లు సమాధానం చెప్పాలని కోరారు.

నెటిజన్ల దిమ్మదిరిగే కౌంటర్

ఈ క్రమంలోనే గన్‌పార్క్ అమరవీరుల స్థూపం ఫోటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ట్వీట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలి దేవత సోనియా గాంధీ అని బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పదవులు అనుభవించిన మాజీ సీఎం కేసీఆర్ చేప్పాలి సమాధానం ప్రజలకి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘వెళ్లి కాళ్ళు పట్టుకుని వచ్చారు కదా.. ఆమెనా సర్’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కేసీఆర్ ఫ్యామిలీ దిగిన ఫోటోను మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరి ఫ్యామిలీ మొత్తం పోయి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తో ఫోటో ఎందుకు దిగారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?