ktr charminar
Politics

KTR: రాచరికం కాదు.. వారసత్వ సంపద!

– రాష్ట్ర చిహ్నంపై రగడ
– చార్మినార్ దగ్గర ధర్నాకు దిగిన బీఆర్ఎస్
– కేటీఆర్ సహా పలువురు నేతల హాజరు
– కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం
– చార్మినార్, కాకతీయ తోరణం రాచరిక గుర్తులు కాదు
– తెలంగాణ వారసత్వ సంపద- కేటీఆర్

Charminar: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తోంది. రాచరిక గుర్తులను తొలగించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించనున్నట్టు స్పష్టమవుతోంది. అయితే, ఈ మార్పులను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వాటిని రాచరిక గుర్తులుగా చూడొద్దని, అవి రాష్ట్ర చారిత్రక వారసత్వానికి నిదర్శనాలు అని చెబుతున్నది. రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద ధర్నా చేశారు.

గురువారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో చార్మినార్ వద్దకు చేరారు. రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. కేటీఆర్ కూడా అక్కడికి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కలిశారు. చార్మినార్ బొమ్మను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని కేటీఆర్ ఫైరయ్యారు. దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలని, కానీ, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నదని ఆగ్రహించారు.

కేసీఆర్‌కు పేరు రావొద్దని, ఆయన పేరు వినపడవద్దన్న ఉద్దేశంతో మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని, అందులో భాగంగానే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని చూస్తున్నట్టు ఆరోపించారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రతి హైదరాబాదీని అవమానించినట్టే, అగౌరవపరిచినట్టే అని పేర్కొన్నారు. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిచడం మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!