KTR: కాంగ్రెస్ హామీలు అమలెప్పుడు? సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్!
KTR ( image credit: twitter)
Political News

KTR: కాంగ్రెస్ హామీలు అమలెప్పుడు? సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్!

KTR: ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై బీఆర్ఎస్ (BRS)  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఖమ్మంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్( KTR) మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగాయన్నారు.

Also Read: KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం సర్పంచ్‌లను బీఆర్ఎస్ గెలుచుకుందని గుర్తు చేశారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్పించే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, నాయకులు వెంకట వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Also Read: KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్

Just In

01

The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

Hyderabad Police: ఆహార కల్తీని హత్యాయత్నంగానే పరిగణిస్తాం.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: వైఐఐఆర్‌సీ మొద‌టి విడుత‌లో బాలిక‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి!

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే.. తెలంగాణకు శాపం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!