Komatireddy Venkat Reddy: కాళేశ్వరం మీరే కట్టారు.. మీరే కూల గొట్టారని హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సభలో చర్చ కోర్టు కేసుల గురించి కాదు.. హరీష్ రావు(Harish Rao) సబ్జెక్ట్ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ..అన్నారం..సుందిళ్లతో ప్రజాధనం దుర్వినియోగం పై చర్చ చేయండి అని సూచించారు. మీరు చేసిన తప్పుల నుండి బయట పడాలని చూస్తున్నారన్నారు.
Also Read: Director Krish: అనుష్క విశ్వరూపాన్ని చూస్తారు.. ‘ఘాటి’పై దర్శకుడు క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజలు ఇప్పటికే శిక్ష వేశారు
కమిషన్ల కోసం 3లిఫ్టుల తో నీళ్ళు తెచ్చే పని చేశారని, ఆ నీళ్ళు మళ్ళీ కిందకి వదిలేశారన్నారు. బీఆర్ఎస్ పొరపాటు నో గ్రహపాటు నో మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ గనుక వచ్చిఉంటే పోలవరం వరకు ఇంకో మూడు లిఫ్టు లు పెట్టీ ఇంకో లక్ష కోట్లు దోచే వాళ్ళు అన్నారు. ప్రజలు ఇప్పటికే శిక్ష వేశారని, ప్రజలు వేసిన శిక్షను మీరు అనుభవిస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రజల నోటి కాడి ముద్ద లాగేశారన్నారు. మాది తప్పు అయ్యింది అని ఒప్పుకోండి అని సూచించారు.
నాగార్జున సాగర్ నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదని, ఏది పడితే అది మాట్లాడకు అని హరీష్ రావు(Harish Rao)ను హెచ్చరించారు. హరీష్ రావు(Harish Rao) మొదలు ఇరిగేషన్ మంత్రి ఉన్న.. తర్వాత లేరు.. ఐదేళ్లు ఇరిగేషన్ సీఎం దగ్గరే ఉంచుకున్నారన్నారు. నేను తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు నేను చేసిన వన్నీ.. కేసీఆర్..కేటీఆర్ వచ్చి చెప్పారన్నారు. సోనియా గాంధీ గురించి కేసీఆర్ ఇక్కడే కూర్చొని సోనియా గాంధీని మెచ్చుకున్నారన్నారు. హరీష్ రావుకి ఏ హోదాలో మైక్ ఇస్తున్నారన్నారు. హరీష్ రావు ఏమైనా డిప్యూటీ ఫ్లోర్ లీడరా ? కాళేశ్వరం పై మాట్లాడండి.. హరీష్ రావు డివియెట్ అవుతూ..కేసుల గురించి మాట్లాడుతున్నారన్నారు. కోర్టు కేసుల గురించి వచ్చే సెషన్ లో పూర్తి స్థాయిలో మాట్లాడుదామన్నారు.
Also Read: Police Quarters: నిరుపయోగంగా పోలీస్ క్వార్టర్స్.. పట్టించుకోని అధికారులు