Kishan Reddy: రాష్ట్రాన్ని పాలించేంది కాంగ్రెస్ కాదని, మజ్లిస్ పార్టీయే పాలిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బోరబండ డివిజన్ బీజేపీ కార్యాలయంలో ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో మజ్లిస్ గూండాల కారణంగా చాలా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించింది మజ్లీస్ పార్టీయేనని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని ఆయన చెప్పారు. నాడు కేసీఆర్ పాలనలో మజ్లిస్ పార్టీ చెప్పినట్లుగా నడుచుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని విమర్శలు చేశారు.
Also Read: Amit Shah: మావోయిస్టుల కంచుకోటలపై కేంద్రమంత్రి అమిత్ షా కీలక ప్రకటన
అంతా కలిసి బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నారు
ఈ మూడు పార్టీలు ఒక్కటేనని ఆయన మండిపడ్డారు. అంతా కలిసి బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని, వారి బాగు కోసమే ఇవి పనిచేస్తాయని కిన్ రెడ్డి విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పరోక్షంగా ఎంఐఎం పార్టీ ఏలాలని చూస్తోందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ను మజ్లిస్ కు అప్పజెప్పవద్దని, ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చే ఎన్నిక అంటూ వాపోయారు. పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి తిరిగే రూట్లలో కూడా స్ట్రీట్ లైట్లు లేవన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది ఎంఐఎంకు వేసినట్టేనన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్ లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని విమర్శలు చేశారు.
Also Read: Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కిషన్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా?
