KCR plan to change party stearing:పాత కారుకు ‘కొత్త డ్రైవర్’?
change party president
Political News, Top Stories

Hyderabad:పాత కారుకు ‘కొత్త డ్రైవర్’?

  • పార్టీ సమూల ప్రక్షాళన చేపట్టనున్న కేసీఆర్
  • పార్టీ అధ్యక్ష పదవిని వేరేవాళ్లకు అప్పగించాలనే యోచన
  • ఈ సారి కుటుంబ సభ్యులను దూరం పెట్టాలనుకుంటున్న కేసీఆర్
  • దళిత సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు
  • పార్టీకి వెనకనుండి అండదండలు అందించాలనే యోచన
  • గతంలో దళిత కార్యకర్తను సీఎం చేస్తానని హామీ
  • ఇప్పుడు అధ్యక్ష స్థానం ఇవ్వడం ద్వారా దగ్గరవ్వొచ్చు
  • త్వరలోనే విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు
  • సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్

KCR plan to change party stearing to SC ST leader:
రోజురోజుకూ గులాబీ పార్టీ కార్యకర్తలలో ఆందోళన పెరిగిపోతోంది. అసెంబ్లీ తర్వాత కొద్దో గొప్పో పుంజుకుంటుంది పార్టీ అని భావించిన నేతలకు జీరో ఫలితాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఓటమికి కారణాలు కూడా విశ్లేషించుకునే పరిస్థితిలో లేని పార్టీ అగ్ర నేతల వ్యవహార శైలితో ఇక పార్టీ మార్పు తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితికి వచ్చారు. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ కూడా ఎన్నడూ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీని, క్యాడర్ ని చేయిజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉంది. అందుకనే బీఆర్ఎస్ ను బతికించుకునే పనిలో ఉన్నారని సమాచారం.

కేసీఆర్ మాటే శాసనం

రెండు పర్యాయాలు తెలంగాణను ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన నేత కేసీఆర్. ఇన్నాళ్లూ ఆయన చెప్పిందే వేదం..ఆయన మాటే శాసనం గా ఉండేది. ఇప్పుడు కార్యకర్తలు కనీసం కేసీఆర్ ను సైతం లెక్కచేయని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ బిగ్ స్కెచ్ వేసే పనిలో ఉన్నారు. పార్టీని బతికించుకోవాలంటే కేవలం నాయకత్వ మార్పు తప్ప వేరే దారి కనబడటం లేదు. అంటే కారు ఓనర్ కేసీఆర్ అయినా దానిని నడిపించే సమర్థుడైన డ్రైవర్ కోసం వెదికే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ఈ సారి పార్టీ కీలక మీటింగ్ పెట్టి తన మనసులోని ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు.

పార్టీని నడిపించే నేత

కేసీఆర్ ఒక వేళ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే కేసీఆర్ తర్వాత పార్టీని నడిపించే నాయకుడు ఎవరు కెటీఆర్ అని కొందరు, హరీష్ రావు అని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇందుకు కేసీఆర్ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబ పార్టీగా ముద్ర వేయించుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి నిర్ణయాలతో లాభం ఉండకపోగా నష్టం ఎక్కువగా ఉందని కేసీఆర్ భావిస్తున్నారట. ఒకప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి ని చేస్తా అని చెప్పిన కేసీఆర్ తన మాట నిలబెట్టుకోకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీని తన కంట్రోల్ లోనే ఉంచుకుని కేవలం అధ్యక్ష పదవిని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన నేతకు అప్పగించాలని భావిస్తున్నారట కేసీఆర్.

దళిత వర్గానికి ప్రాముఖ్యం

అత్యధిక స్థానాల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేయటం ద్వారా గులాబీ పార్టీ ఎనిమిది సీట్లలో గెలవటానికి ‘కమలానికి’ దోహదపడిందనే అపవాదును మూటగట్టుకుంది. ఇలాంటి వైఫల్యాలన్నింటి నుంచి గట్టెక్కాలని భావించారో ఏమోగానీ…బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు.
ఒకవేళ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెబితే దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన, ఆ మాటను నిలబెట్టుకోలేదన్న అపవాదు కూడా ఉంది. ఈ క్రమంలో ప్రవీణ్‌ కుమార్‌నే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ‘ఉభయ తారకం’గా ఉంటుందనే చర్చ కూడా కారు పార్టీలో జోరందుకుంది. ఈ విషయంపై కూడా కేసీఆర్‌ దృష్టి సారించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇలా ముందుకెళితే గతంలో ఉన్న మచ్చను పోగొట్టుకోవచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..