Politics

Hyderabad : ఏడు పదులు నిండినా యావ చావని నేతలు

  • రేవంత్ పదవిపై కన్నేసిన బీఆర్ఎస్, బీజేపీ
  • కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉండదంటూ విష ప్రచారం
  • 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలు
  • పొరుగు రాష్ట్రంలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడంటూ కలలు
  • జగన్ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న నేత
  • తమకు సహకరిస్తాడని కేసీఆర్ అండ్ కో ఊహలు
  • దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇటు రేవంత్ ప్రభుత్వం కూల్చే యత్నాలు

KCR,Modi thoughts to collaps Reventh reddy government:
ఎంతో కష్టపడి, పాదయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చి పాలనలో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టాలని భావిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. ఈ విషయంలో ఏడు పదులు దాటిక కేసీఆర్, మోదీ ల ఆలోచన ఒక్కటిగానే కనిపిస్తోందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయితే దక్షిణాదిలో తన ఉనికే కోల్పోతున్న బీజేపీకి ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేకపోవడానికి కారణం తమకు ప్రభుత్వాన్ని కూల్చే బలం లేనందునే. అయితే ఈ మధ్య కేసీఆర్, కేటీఆర్ సైతం పనిగట్టుకుని రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని అనడం అందుకు ధీటైన జవాబు రేవంత్ రెడ్డి ఇవ్వడం చూస్తునే ఉన్నాం.

25 మంది టచ్ లో..

అయితే ఇటీవల కేసీఆర్ తనకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు. పైగా ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో జగన్ గెలవబోతున్నాడని తనకు సర్వే రిపోర్టు వచ్చిందంటూ చెబుతున్నారు. సొంత రాష్ట్రంలో తాను గెలుస్తానో ఓడుతానో తెలుసుకోలేని మాజీ సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రంలో జగన్ ఎలా గెసుత్తాడని చెప్నగలరని విపక్షాలు అడుగుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేసీఆర్‌ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో ఎందుకు అలయ్ బలయ్ అంటున్నారనే సందేహం ఈ సందర్భంగా వస్తోంది. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్‌ ఆషామాషీగా అనలేదని తెలుస్తోంది. అదంతా చంద్రబాబుపై కక్ష. ఎందుకంటే బాబు కు ప్రియశిష్యుడు అయిన రేవంత్ రెడ్డి వలనే తన పదవి పోయిందనే కడుపు మంట. అయితే అది అక్కడితో ఆగలేదు.. కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జగన్ సహకరిస్తాడని ..

వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్‌ రెడ్డి సహకారం అవసరమని ఆయన భావిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్‌ మద్దతు అవసరమని అనుకుంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్‌ గట్టిగా కోరుకుంటున్నారు. ఏపీలో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది అంటే దానికీ ఓ లెక్క ఉంది. ఆ లెక్క వెనక భారీ స్కెచ్ కూడా ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ప్రస్తతం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు .జగన్‌రెడ్డి సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తీసుకువచ్చి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ తాను అధికారంలోకి రావాలని కేసీఆర్‌ భావిస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఆలోచనలు ఒక్కటే..

అయితే ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియదుగానీ వచ్చే ఎన్నికలలో జగన్ గెలుస్తాడో లేదో తెలియదు. ఇక ఇక్కడి మంత్రి కేసీఆర్ ను నమ్మి నట్టేట మునిగేందుకు ఎంత మాత్రం ఇష్టపడడని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ ఇలాంటి వేస్ట్ ఆలోచనలు మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి తనకున్న ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే చాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణ రాజకీయాలలో ఏమి జరుగుతుందో ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణ రాజకీయాలలో స్పష్టత ఏర్పడుతుందా? లేదా? అన్నది తేలిపోతుంది. జాతీయ రాజకీయాలలో ప్రస్తుతానికి బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని మింగేయడానికి కేసీఆర్‌తో పాటు భారతీయ జనతా పార్టీ కూడా సహజంగానే ప్రయత్నిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ముందుగా హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఖతం చేస్తారు. తర్వాత తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని పడగొడతారని కేసీఆర్‌ కలలు కంటున్నారు అని వాటికి ధీటుగా ఎదుర్కునే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నాయని…ముందు ముందు రేవంత్ రెడ్డి తనలోని అసలైన రాజకీయాన్ని బయటకు తీసి తానేమిటన్న సంగతి చెబుతారని అంతా బావిస్తున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?