kcr target arrest
Politics

Hyderabad: అరెస్ట్.. డ్రామా..!!

– మోదీని ఎదిరించా
– రేపో మాపో నేను కూడా అరెస్ట్ అవుతా
– ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతున్న కేసీఆర్
– రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కక్ష కట్టారంటూ విమర్శలు
– సానుభూతి డ్రామా అంటున్న ఇతర పార్టీల నేతలు

KCR comments on PM Modi(Telangana politics):మాజీ సీఎం కేసీఆర్‌కు పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో సరైన సీట్లు రాకపోతే పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అటు రాజకీయ నేతల్లోనూ ఇటు జనంలోనూ కేసీఆర్ పట్ల విశ్వాసం సన్నగిల్లడమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయితేనే వరుస బెట్టి నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఒకటో రెండో సీట్లు తెచ్చుకుంటే మాత్రం ఉన్నవాళ్లు కూడా ఆలోచనలో పడే అవకాశముంది. ఇంకోవైపు కేసుల భయం వెంటాడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ తనదేనంటూ ఎన్నికల ప్రచారంలో తెగ వల్లె వేస్తున్నారు కేసీఆర్. మోదీని ఎదిరించిన వాళ్లలో తానూ ఉన్నానని, అరెస్ట్ కావొచ్చని చెబుతున్నారు. అలాగే, రేవంత్ రెడ్డి కూడా కక్షగట్టారని అంటున్నారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలు సెంటిమెంట్ రగిలించే సానుభూతి డ్రామాగానే ప్రజలు చూస్తున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

లక్ష్యానికి అవాంతరాలు ఎన్నో

అధికారం చేజారిన నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం పది సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. అయితే, ఆయన ఎంతగా తపించినా ఒకటి, రెండు సీట్లకు మించి రావనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దీంతో.. ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేయటమే కాదు, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. మోదీని ఎదిరించానని, తనను అరెస్ట్ చేయాలని చూశారని, కానీ కుదరలేదని చెప్పారు.

సెంటిమెంట్ రాజకీయం

కేసీఆర్ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు స్పందిస్తూ, కేసీఆర్‌కు భయం పట్టుకుందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్న టెన్షన్‌లో ఉన్నారని, అందుకే అరెస్ట్ అంటూ కొత్త డ్రామా షురూ చేశారని విమర్శిస్తున్నారు. దీనిపై బండి సంజయ్ మాట్లాడుతూ, అవినీతిని బీజేపీ సహించదని అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, ఇక్కడి డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!