Kavitha: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద విల్లాలున్న సంపన్నుల కంటే పేదలే అత్యధికంగా ఉన్నారని తెలంగాణ జాగృతి వ్యవస్ధాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో కవిత గురువారం పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ పేదలు నివసించే బస్తీల్లో రోడ్లు చిద్రమై, సకాలంలో నీరు రాక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వివరించినట్లు కవిత అన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: సింగరేణి ముట్టడి ఉద్రిక్తం.. రోడ్డుపై బైఠాయించిన కవిత.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రభుత్వాలు నిర్లక్ష్యం
శేరిలింగంపల్లిలోని బీఏ నగర్ బస్తీ వాసుల సమస్యలను ప్రస్తావిస్తూ, దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడ పేదలు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ కరెంట్, సబ్సిడీ గ్యాస్, మహిళలకు రూ.2500 లాంటి ఆరు గ్యారెంటీలు అమలు జరగడం లేదని ఆమె ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్‌లోని భూపాల్ నగర్‌లో 45 ఏళ్లుగా 2 వేల కుటుంబాలు 25 ఎకరాల స్థలంలో జీవనం సాగిస్తున్నారని కవిత తెలిపారు. అయితే, ఇక్కడి పేదలకు ఆ భూములను రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మూసాపేటలో యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్యం, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. యువత మత్తుకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతామని కవిత అన్నారు.
Also Read: MLC Kavitha: రాష్ట్రంలో కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలని కవిత డిమాండ్..!

