Kavitha: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2.0 ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. జాగృతి కార్యక్రమాలు, మరోవైపు బీఆర్ఎస్ కార్యక్రమాలకు పరిమితమైన ఆమె.. బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఆమె యాక్టీవ్ అయ్యారు. జనంబాట పేరుతో ప్రజాక్షేత్రం లోకి వెళ్తున్నారు. తన మార్క్ చూపిస్తున్నారు. జనంబాట కార్యక్రమంలో కవిత మాటతీరుతో పాటు శైలీలోనూ కొత్తగా కనిపిస్తున్నారు. చేనేత చీరలు కట్టుకుని.. కొప్పుముడి, పెద్దగా బొట్టు, నిండుదనంతో దర్శనమిస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా మరోవైపు గతానికి భిన్నంగా కవిత మార్పు మాజీ సీఎం జయలలిత కనిపిస్తున్నారనే చర్చజరుగుతుంది. అంతేకాదు కవిత కూడా జయలలిత తరహాలో తయరవుతున్నారనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Also Read: MLC Kavitha: త్వరలో వారి చిట్టా బయటపెడతా అంటూ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
33 జిల్లాల్లో యాత్రకు శ్రీకారం
బీఆర్‌ఎస్ రాజకీయాల్లో ఓ దశాబ్ధానికి పైగా కవిత చక్రం తిప్పారు. ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేశారు.తెలంగాణ ఉద్యమంలోనూ జాగృతి సంస్థతో కీలకపాత్ర పోషించారు. బీఆర్‌ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, నేతల శైలీపైఘాటు విమర్శలు చేయడంతో బహిష్కరణకు గురయ్యారు. తన రాజకీయ పయనాన్ని కొత్త కోణంలో ప్రారంభించారు. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో భాగంగా.. కవిత జనం బాట పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం కవిత 33 జిల్లాల్లో యాత్రకు శ్రీకారం చుట్టడంతో పాటు యాత్రను సైతం ప్రారంభించారు. అయితే కవిత గతానికి భిన్నంగా కనిపిస్తున్నారు. ఆమె ప్రస్తుత కట్టు, బొట్టు శైలి ప్రజా సమక్షంలో ఆమె ఆహార్యం చూస్తుంటే తమిళనాడు రాజకీయ చరిత్రలో అమ్మగా గుర్తింపు పొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపిస్తుందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది. జయలలిత తరహాలో బలమైన మహిళా నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకునేందుకు వేసిన వ్యూహాత్మక అడులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పరిణితి చెందిన నాయకులిగా మార్చేసిందనే ప్రచారం
కవిత ఈ మార్పు మరింత సంప్రదాయ బద్ధంగా, పరిణితి చెందిన నాయకులిగా మార్చేసిందనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో కొప్పుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకునే ఆమె కొప్పును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుడా ఆమె వస్త్రాధారణ కూడా పూర్తిగా మారింది. చేనేత చీరలు కడుతూ తెలంగాణలో చేనేత కార్మికులకు మద్దతుగా ఆమె వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు జాగృతి నాయకులు పేర్కొంటున్నారు. అలాగే ఆమె నడక, ప్రజలకు అభివాదం చేసే విధానం సైతం పూర్తిగా మారింది. అయితే ప్రజలకు దగ్గరయ్యే ఉద్దేశంతోనే ఆమె శైలీని మార్చినట్లు సమాచారం. అంతే కాదు జనంబాట స్టార్ట్ అయిన తర్వాత కవిత స్పీచ్ ను సైతం పూర్తిగా మార్చింది.
గులాబీ లీడర్లపై మాటలతో అటాక్
సందర్భాను సారంగా పదునైన డైలాగ్ లు వదులుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై, మరోవైపు కేంద్రంపై, ఇంకోవైపు బీఆర్ఎస్ పైనా విమర్శలకు పదును పెడుతున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనను పార్టీ నేతలే ఓడించారని మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో గులాబీ లీడర్లపై మాటలతో అటాక్ చేసింది. పాలమూరు పర్యటనలో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పట్టించుకోవడం లేదని విమర్శలు చేసి రైతులను ఆకర్షించేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలోనూ ఉదండపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారని ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపారు.
జయలలితను అనుకరణ
రాజకీయాలలో దృష్టిపరమైన గుర్తింపు ఎంత ముఖ్యమో జయలలిత నిరూపించారు. ఆమె ప్రత్యేకమైన వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్.. ధైర్యంగా మాట్లాడే ధోరణి ఆమెను ఐకాన్‌గా మార్చాయి. ఆమె జయలలిత ఆహార్యాన్ని కవిత రీక్రియేట్ చేస్తున్నారనే చర్చరుగుతుంది. ఈ విజువల్ పాలిటిక్స్ ద్వారా ఆమె ప్రేక్షకుల మనసుల్లో బలమైన నాయకురాలిగా నిలిచిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మహిళా ఓటు బ్యాంకులో బలమైన సెంటిమెంట్‌ను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే కవిత ఈ నాయకత్వ శైలిని ఎంచుకున్నారని చర్చ మొదలైంది. ఇది మహిళా సాధికారతకు ప్రతీకగా సాఫ్ట్ లీడర్ ఇమేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
కవిత ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటబాటపట్టారు. ఆయా వర్గాలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగుల పక్షాన, యువత, విద్య, ఉద్యోగాలు, ఉద్యోగుల సమస్యలపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అన్ని వర్గాల పక్షాన పోరాడేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే జనంబాటతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని ఒక్కో అంశంపై ప్రాధాన్యత క్రమంలో పోరాటం చేయబోతున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి.
Also Read: Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				