Kadiyam Srihari
Politics

Kadiyam: ఆ ముగ్గురి గురించి మాట్లాడితే నా టైం వేస్ట్ అయినట్టే: కడియం

Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్యలకు ప్రజల్లో ఎలాంటి పేరు ఉన్నదో అందరికీ తెలుసు అని విమర్శించారు. ఈ ముగ్గురి గురించి మాట్లాడటం అంటే తన సమయాన్ని వృథా చేసుకోవడమేనని కడియం శ్రీహరి అన్నారు. ఇక తాను పార్టీ మారడం గురించి ఇంకా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ దేశంలో పార్టీ మారిన నాయకుడిని నేనొక్కడినే లేను. పార్టీ మారిన తొలి వ్యక్తిని నేను కాదు, అలాగని చివరి వ్యక్తిని కూడా నేను కాదు. సాయంత్రం ఒక పేరుతో ప్రభుత్వం ఉంటే.. తెల్లారేసరికి బోర్డు తిప్పేసి వేరే పేరుతో ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితులను చూస్తున్నాం’ అని చెప్పారు.

దేశంలో బీజేపీ పోకడలు శృతిమించాయని కడియం శ్రీహరి విమర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని.. కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనే సదుద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వివరించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు అనేక నిధులను తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కడియం కావ్య 2 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నదని విశ్వాసాన్ని ప్రకటించారు.

Also Read: రుణమాఫీ చేస్తే పార్టీ రద్దు చేసుకుంటావా?: రేవంత్ సవాల్

తాను ఎవరి అవకాశాలను లాక్కోలేదని, రాజయ్యకు అవకాశం వస్తే.. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడని, ఆరూరి రమేశ్‌కు అవకాశం వస్తే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడని, పసునూరి దయాకర్‌కు అవకాశం వస్తే రెండు సార్లు ఎంపీ అయ్యాడని కడియం శ్రీహరి గుర్తు చేశారు. అవకాశాలను ప్రజల కోసం ఉపయోగిస్తే రాజకీయాల్లో చాలా కాలం ఉంటారని, దుర్వినియోగం చేశాక అవకాశం రాకపోతే కడియం శ్రీహరి ఎలా బాధ్యుడవుతారని వివరించారు. పార్టీలో చేరుతానని పోతే కూడా రాజయ్యను తిరస్కరించిన పరిస్థితుల చూశామని, అభ్యర్థి ప్రకటన రోజు కూడా అక్కడికి రావొద్దని ఆపిన విషయాన్నీ చూశామని కడియం తెలిపారు. వారు ఎదుర్కొంటున్న అవమానాలను మర్చిపోయి ఇప్పుడు తొడలు కొడుతున్నారని, మీసం తిప్పుతున్నారని, పాతాళానికి తొక్కుతానని అంటున్నారని వివరించారు. ఈ అహంకారపు మాటలే ఈ దుస్థితికి తెచ్చాయని అన్నారు.

కుల, మత ప్రస్తావన తెచ్చి ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుతారని, 30 ఏళ్ల నుంచి ఘన్‌పూర్‌లోనే ఉంటున్నారని, 50 ఏళ్ల నుంచి ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నానని కడియం శ్రీహరి తెలిపారు. కానీ, బురదజల్లే మాటలు మాట్లాడుతున్నారని, నిజంగా ఏదైనా సమాచారం ఉంటే ముందు ఎన్నికల కమిషన్‌కు ఇవ్వండి అని అన్నారు. మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్య గురించి మాట్లాడి సమయాన్ని వృథా చేసుకోలేనని వివరించారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?