Bhadradri thermal power plant
Politics

Power: ‘ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రూ. 2,600 కోట్ల నష్టం’

Power Purchase: విద్యుత్ కోసం ఛత్తీస్‌గడ్‌తో కాంపిటీటివ్ రూట్‌లో బిడ్డింగ్ చేపట్టకుండా ఒప్పందం చేసుకోవడం మూలంగా రాష్ట్రానికి రూ. 2,600 కోట్ల నష్టం వాటిల్లందని విద్యుత్ ఉద్యోగి రఘు అభిప్రాయపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరైన తర్వాత రఘు.. బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందించామని, కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశామని వివరించారు.

ఒప్పందం జరిగింది.. విద్యుత్ సరఫరా కాలేదు

ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా జరగలేదని రఘు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగా వాట్‌ల విద్యుత్ ఒప్పందం జరిగిందని, కానీ, అది ఆ మేరకు సప్లై చేయలేదని వివరించారు. కాగా, అదనంగా మరో 1000 మెగా వాట్‌ల ఒప్పందం చేసుకున్నారని, తర్వాత తప్పు తెలుసుకుని ఒప్పందం రద్దు చేసుకోవాలని ప్రయత్నిస్తే అది కుదరలేదని తెలిపారు. విద్యుత్ కోసం ఇరు రాష్ట్రాల డిస్కంల ద్వారా ఒప్పందాలు (ఎంవోయూ) జరిగాయని వివరించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ రూపంలో కాకుండా ఎంవోయూ చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2,600 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. అసలు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందానికి రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేదని, కేవలం ప్రొవిజన్‌కు మాత్రమే ఆమోదం ఇచ్చిందని తెలిపారు. ఆ ప్రొవిజన్‌కూ సవరణలు చేయాలని సూచించగా.. ఏడేళ్లు గడిచినా ప్రభుత్వం సవరణలు చేయలేదని పేర్కొన్నారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో బీహెచ్ఈఎల్ 2013-2014లో 88 శాతం ఉంటే.. ఆ తర్వాత జీరోకు పడిపోయిందని, బీహెచ్ఈఎల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ పై కాగ్ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు.

ప్రభుత్వ చాయిస్ కాదు

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ చాయిస్ కాదని రఘు స్పష్టం చేశారు. ఈ టెక్నాలజీ ఇండియా బుల్స్ కోసం రూపొందించిందని, కానీ, ఇండియా బుల్స్‌తో ఒప్పందం రద్దవడంతో సబ్ క్రిటికల్ మిషినరీ నెలకొల్పారని వివరించారు. దాంతో జరిగే నష్టాన్ని 25 ఏళ్లపాటు భరించాల్సి ఉంటుందని తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి లొకేషన కూడా అనువైనదని కాదని, వరదలు వస్తే భద్రాద్రి ప్లాంట్ మునిగిపోయే ముప్పు ఉందని, యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువ ఉంటుందని చెప్పారు. పర్యావరణ అంశాలనూ పట్టించుకోకుండా భద్రాద్రి ప్లాంట్ నిర్మించారని ఆరోపించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ రేటు తక్కువయ్యే అవకాశం ఉండేదని, కానీ, గత ప్రభుత్వం అలా చేయలేదన్నారు.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్