Politics

Hyderabad: గులాబి దళపతిని నమ్మితే అధోగతి

 

Minister Ponguleti criticise kcr : మాజీ ముఖ్యమంత్రి, గులాబీదళపతి కేసీఆర్ పై కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఓ ప్రైవేటు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ ను నమ్మి బాగుపడ్డవారు ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆయనను నమ్మితే అధోగతే అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారన్నారు. అందుకనే గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇంకా తానే సీఎం అని అనుకుంటున్నాడు. అప్పట్లో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో కలిపేస్తా అని ప్రగల్బాలు పలికారు. నమ్మకాన్ని నిలబెట్టుకునే విశ్వసనీయత అసలు కేసీఆర్ కు ఉందా అన్నారు.

విశ్వసనీయత లేని పార్టీకి ఎందుకు వెళతాను?

కొంత మంది తాను పార్టీ మారతానని ఊహాగానాలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను.. అలాంటిది నేను ఎందుకు పార్టీ మారుతానని అన్నారు.. బీఆర్ఎస్ పార్టీకి ఏ విశ్వసనీయత ఉందని అన్నారు. ఇంకా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెప్పడం అంతా ఉత్తిదేనని గులాబీ బాస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాము ఎవరినీ ప్రలోభ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికలకు, బీఆర్ఎస్ నుండి వలసలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కొందరు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని.. ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!