Telangana youth voters support
Politics

Polling: ఓటర్ స్లిప్ అందకుంటే ఏం చేయాలి? మన ఓటును ఎలా చెక్ చేసుకోవాలి?

Voting: ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఇక ఓటరు తన హక్కును వినియోగించుకోవడమే మిగిలుంది. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసి తీర్పు ఇవ్వాల్సి ఉన్నది. ఓటు వేయడానికి ఓటర్ స్లిప్ అవసరం. కొన్ని సార్లు సాంకేతిక కారణాలతో ఈ ఓటర్ స్లిప్ కొందరికి అందదు. అలాంటి సమయంలో ఏం చేయాలి? పోలింగ్‌కు ముందే ఓటర్ స్లిప్‌ను సిబ్బంది ఓటర్లకు అందిస్తారు. కానీ, ఒక వేళ ఆ ఓటర్ స్లిప్ అందకున్నా కంగారుపడాల్సిన అవసరం లేదు. ఇందుకు ఎన్నికల సంఘం పలు పరిష్కారాలను సూచించింది. మీ ఫోన్‌లో ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఆ ఓటర్ స్లిప్‌ను ప్రింట్ తీసుకుని పోలింగ్‌ బూత్‌కు వెళ్లితే సరిపోతుంది.

ఓటర్ స్లిప్ పొందాలంటే https://electoralsearch.eci.gov.in/ సైట్‌లోకి వెళ్లాలి. ఇందులో ఓటర్ ఐడీ, రాష్ట్రం వివరాలు నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే ఓటర్ వివరాలు కనిపిస్తాయి. అందులో ఓటరు పేరు, ఓటర్ ఐడీ, పోలింగ్ బూత్ వివరాలు ఉంటాయి. ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్, పోలింగ్ బూత్ చిరునామా కూడా ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మరో విధంగానూ ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ నుంచి 1950 అనే నెంబర్‌కు మెస్సేజీ చేయాల్సి ఉంటుంది. ECI అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి 1950 నెంబర్‌కు పంపించాలి. వెంటనే పోలింగ్ బూత్, సీరియల్ నెంబర్‌లతో మెస్సేజీ వస్తుంది. లేదంటే. 1950 నెంబర్‌కు కాల్ చేసి కూడా వివరాలు కనుక్కోవచ్చు. ఓటు వేయడానికి కచ్చితంగా ఓటరు కార్డే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ ఓటరు అయి ఉండి.. ఈసీ ధ్రువీకరించిన 12 కార్డుల్లో ఏది ఉన్నా ఓటు నమోదు చేసుకోవచ్చు.

పోలింగ్ కేంద్రంలోకి మొబైల్, క్యామెరా, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను అనుమతించరు. ఎందుకంటే మనది రహస్య పోలింగ్ విధానం. మనం వేసే ఓటు ఎవరికి అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. అక్కడ ఎలాంటి విషయాలను రికార్డ్‌ చేయడానికి అనుమతి ఉండదు.

ఫస్ట్ టైం ఓటర్లు.. ఈ డౌట్స్ క్లియర్ చేసుకోండి:

తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునేవారు.. కొన్ని విషయాలను తెలుసుకోవడం ఉత్తమం. పోలింగ్ కేంద్రంలో ప్రక్రియ ఎలా ఉంటుంది? నమోదు చేసిన ఓటు మనం అనుకున్న అభ్యర్థికే పడిందా? లేదా? అనేది చెక్ చేసుకోవడం కూడా అవసరం. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే మొదటి అధికారి ఓటరు జాబితాలో.. గుర్తింపు కార్డులో మీ పేరును చెక్ చేస్తారు. సరిపోలిన తర్వాత మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఓ చీటి ఇస్తారు. దాన్ని మరో అధికారి చెక్ చేసి మీరు ఓటు వేయడానికి అనుగుణంగా ఈవీఎంను సిద్ధం చేస్తారు.

అనంతరం, ఈవీఎం యంత్రం వద్దకు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈవీఎం పై సీరియల్ నెంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి సంబంధించి పోలింగ్ సింబల్ గుర్తులు కనిపిస్తాయి. ఆ సింబల్స్ పక్కనే బ్లూ కలర్‌లో బటన్ ఉంటుంది. మీరు వేయాలనుకున్న అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ కలర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దాని పక్కనే ఉన్న రెడ్ సిగ్నల్ వెలుగుతుంది. బీప్ అనే శబ్దం కూడా వస్తుంది. అప్పుడు ఓటు నమోదైనట్టు అర్థం చేసుకోవాలి. అయితే.. మీరు అనుకున్న అభ్యర్థికే ఓటు పడిందా? లేదా? అనేది ఆ పక్కనే ఉంచిన వీవీప్యాట్ యంత్రంలో తెలుస్తుంది. ఈ వీవీప్యాట్ యంత్రంలో మనకు కనిపించేలా ఓ స్లిప్ వచ్చి ఏడు సెకండ్ల పాటు కనిపించి కింద పడిపోతుంది. ఆ స్లిప్‌పై మీరు ఓటు వేసిన అభ్యర్థి సింబల్, సీరియల్ నెంబర్ కనిపిస్తాయి. ఇందులో ఏది సరిగా జరగకున్నా పోలింగ్ కేంద్రంలోని ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

Just In

01

The Raja Saab: ‘కాంతార చాప్టర్ 1’కు, ‘ది రాజా సాబ్’కు ఉన్న లింకేంటి? నిర్మాత ఏం చెప్పారంటే?

Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూశాను.. మైండ్ బ్లోయింగ్.. బెస్ట్ ఏంటంటే?

OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!