telangana congress loksabha candidates list
Politics

Hot Politics : బిగ్‌డే.. తెలంగాణలో హీటెక్కిన రాజకీయం

Hot Politics In Telangana : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల యుద్ధానికి పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి. షెడ్యూల్ రేపో మాపో అన్నట్టుగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఒకేరోజు మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు నిర్వహించడం, అగ్ర నేతలు హాజరవుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల హవానే కొనసాగించాలని కాంగ్రెస్, మరిన్ని స్థానాలు పెంచుకోవాలని బీజేపీ, ఈసారన్నా పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్, ఇలా ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. అది కూడా ఒకేరోజు.

కాంగ్రెస్ మహిళా శక్తి నినాదం

తెలంగాణలో అధికారం చేపట్టాక ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మహిళల మనసు దోచుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి ప్లాన్‌లో తొలి సక్సెస్ అందుకోగా, 500కే గ్యాస్ సిలిండర్ పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌తో మరింత దగ్గరైంది. ఇదే క్రమంలో స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీకి నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తోంది. లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఇదే వేదికపైన మహాలక్ష్మి గ్యారెంటీపైనా ఓ క్లారిటీ రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరై ప్రసంగించనున్నారు.

వారియర్స్‌తో బీజేపీ బడా ప్లాన్

గత ఎన్నికల్లో బీజేపీ 4 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను డబుల్ చేయాలనుకుంటోంది. ఇంకొంచెం కష్టపడి 10 స్థానాలు దాటించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి అగ్ర నాయకులు క్యూ కట్టారు. ఇప్పటికే ప్రధాని మోడీ వచ్చి రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు. అగ్ర నేత అమిత్ షా కూడా వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి అందివచ్చే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే, బూత్ అధ్యక్షులతోపాటు పార్టీ నేతలతోనూ సమావేశం కానున్నారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్‌లో కూడా పాల్గొననున్నారు షా.

ఎన్నికలకు కేసీఆర్ సమరశంఖం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసలే ఓటమి బాధలో ఉన్న ఆయనకు వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీకి ఎలాగైనా పునర్వైభవం తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కదన భేరీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓవైపు గత ప్రభుత్వ తప్పిదాలను, అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెడుతోంది. ఇంకోవైపు నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పీచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా మూడు పార్టీల అగ్ర నేతలు ఒకేరోజున సభలు నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?