– వరద నీటి కారణంగా ట్రాఫిక్ జామ్
– రాష్ట్రంలో సోమ, మంగళ వారాల్లో వర్ష సూచన
Heavy Rains: ఉపరితల ఆవర్తనం వల్ల రాజధాని నగరం హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో కొద్ది సమయంలోనే భారీగా వరద నీరు వచ్చి రోడ్లపై చేరింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. మియాపూర్, కొండాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సరూర్ నగర్, లింగంపల్లి, మలక్ పేట్, మాదాపూర్, చాదర్ ఘాట్, సైదాబాద్, చంపాపేట్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బోరబండ, ఎస్సార్ నగర్, యూసుఫ్ గూడ, అమీర పేట్, పంజాగుట్ట ప్రాంతాలు వర్షం భీకరంగా కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చింది. చాలా చోట్ల నదులపై వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వరద నీరు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా నీటిని క్లియర్ చేయడానికి జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దూకాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు ఇక్కడ రోడ్డు విస్తరణ పనులూ జరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వర్షం కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
ఇదిలా ఉండగా, తెలంగాణలో సోమవారం, మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.