Harish rao visited siddhipet government boys highschool:
బుధవారం నుంచి పాఠశాలలు వేసవి సెలవల తర్వాత పునః ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేట ప్రభుత్వ బాయ్స్ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 5 వేలకు పైగా ఉన్న పాఠశాలలను ప్రారంభం అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలోనే ఉత్తమ విద్యను అందించడంలో సిద్ధిపేట రెండో స్థానంలో ఉంది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఇక్కడి పాఠశాలలను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పదవిలో ఉన్నా లేకున్నా పాఠశాల అభివృద్ధి కి కృషి చేస్తాను.
ఉచిత కరెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మన ఊరు మన బడి కింద పాఠశాలలను అభివృద్ధి చేయాలి. సీఎం రేవంత్ హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్, పారిశుధ్య సిబ్బందిని తక్షణమే నియమించాలి. ఎన్నికలలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 25 వేలతో వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించాలి. గతంలో నా సొంత డబ్బులతో విద్యార్థులకు స్కాక్స్ పెట్టించానన్నారు. అనంతరం హరీష్ రావు బడిబాటలో భాగంగా సిద్ధిపేట ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు బుక్స్ మరియు యూనిఫామ్స్ పంపిణీ చేశారు .