Harish Rao: దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish)సూచించారు. సమస్యలు పరిష్కరించాలంటూ అలంపూర్ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రపై ఎక్స్ వేదికగా స్పందించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర చేయడం కాదు, గురుకుల పిల్లల పాదయాత్రపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌కు చురకలంటించారు. ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే రేవంత్(Revanth) తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.
Also Read:Bhadrachalam: పుణ్యక్షేత్రంలో పాడు పనులు.. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
నీళ్ళ కోసం పాదయాత్ర
పరిపాలన గాలికి వదిలేసి, అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్,(Revanth) కాంగ్రెస్‌కు గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయం అన్నారు. తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ‘ చదువుకోవాల్సిన పిల్లలను పట్టెడు అన్నం కోసం, తాగు నీళ్ళ కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది నీ అసమర్ధ పాలన. వుయ్ వాంట్ జస్టీస్ అన్నందుకు పోలీసులను పెట్టి, బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది.
ప్రభుత్వంలో చలనం కలుగదా?
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా ప్రభుత్వంలో చలనం కలుగదా? రేవంత్(Revanth) ఇప్పటికైనా కళ్ళు తెరువు. మీ పాలనలో రోజు రోజుకీ పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టు. జోగులాంబ గద్వాల్ జిల్లా,(Jogulamba Gadwal District)అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు విద్యార్థులు ఇవ్వాలనుకున్న ఫిర్యాదుకు తక్షణం పరిష్కారం చూపాలి. స్థానిక ఎన్నికల్లో లబ్ధికోసం మరోసారి పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ, గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద ముందు దృష్టి సారించాలి’ అని హరీశ్ హితవు పలికారు.
Also Read: Student Died: హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి
