Minister Komatireddy Venkat Reddy Sensational Comments
Politics

Phone Tapping Case: ప్రభాకర్ రావును కలవడానికే హరీశ్ రావు అమెరికా పర్యటన

Prabhakar Rao: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని, ఎన్నో బలిదానాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. ఎందరో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పదవుల త్యాగం చేశారని, పదేళ్ల తెలంగాణను మోసకారి కేసీఆర్ లూటీ చేశారని ఆగ్రహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తే.. కేసీఆర్ కుటుంబం అంతా కటకటాలపాలవుతుందని చెప్పారు. అందుకే ప్రభాకర్ రావును రానివ్వకుండా హరీశ్ రావును అమెరికాకు కేసీఆర్ పంపారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తున్నదని, గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. కేటీఆర్ కుటుంబానికే పరిపాలన పరిమితం అయిందని, ప్రతి స్కీంలో స్కాం చేశారని ఆరోపణలు చేశారు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీలో కోట్ల రూపాయాలు తిన్నారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మాటతప్పారని పేర్కొన్నారు. అవసరం లేని కాళేశ్వరాన్ని కట్టి ప్రజల సొమ్మును గంగపాలు చేశారని, అదీ అప్పుడే కూలిపోవడం ప్రపంచ వింతగా మారిందని సెటైర్ వేశారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నారని, పదేళ్లలో ఎన్ని కేబినెట్ సమావేశాలు పెట్టారని, సచివాలయానికి ఎన్ని సార్లు వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌తో పెద్దతప్పు చేశారు..

ప్రపంచంలో నీతిలేని పని ఫోన్ ట్యాపింగ్ అని, రౌడీలను పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారని, లక్షల కోట్లు వసూళ్లు చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బుద్ధి ఉన్న సీఎం ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అని ప్రశ్నించారు. రేపో మాపో ఈ కేసులోని ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అప్రూవర్‌గా మారుతారని, అప్పుడు కేసీఆర్ కుటుంబం అంతా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు వస్తాయని తెలిసి కేసీఆర్.. హరీశ్ రావును అమెరికాకు పంపించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావును హరీశ్ రావు దొంగచాటుగా అమెరికాలో కలిశారని, ఇప్పట్లో హైదరాబాద్‌కు రావొద్దని చెప్పి వచ్చారని ఆరోపించారు.

ప్రభాకర్ రావుతో హరీశ్ భేటీ?

కేసీఆరే.. ప్రభాకర్ రావును హైదరాబాద్‌ రాకుండా ఆపుతున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని చికాగో నగరంలో ప్రభాకర్ రావును హరీశ్ రావు కలిశారా? లేదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు అమెరికాకు వెళ్లడం వెనుక కారణం ఏమిటీ? అని అడిగారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అమెరికా దాకా వెళ్లిందని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినందుకు అక్కడ కూడా సంబురాలు చేసుకుంటున్నారని అన్నారు.

మాది నీచ సంస్కృతి కాదు:

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి గురించి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ప్రతినిధులే ఉన్నారని మంత్రి తెలిపారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని, కానీ, ఒక వేళ కచ్చితంగా అక్కడ గెలవాలని అనుకుంటే గెలిచేవాళ్లమే అని అన్నారు. కానీ, తమది కేసీఆర్‌లా కొనుగోలు చేసే నీచమైన సంస్కృతి కాదని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు తప్పకుండా వస్తాయని వివరించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు