Harish Rao: అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు
Harish Rao ( image credit: sweetcha reporter)
Political News

Harish Rao: అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు రాసుకుంటున్నాం : మాజీ మంత్రి హరీష్ రావు!

Harish Rao: సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ. 7,000 కోట్లను మంత్రి ఉత్తమ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పంచుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. 20% కమిషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో  మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాల్లో నీటి వాడకం కేవలం 28.49% మాత్రమే అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడిందని, 25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్-చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ పవర్ అన్నారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లు పేదవాడికి అన్నం పెడతాయా? అని ప్రశ్నించారు.

సీఎం కు సచివాలయం అంటేనే భయం పట్టుకుంది. వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు ఎక్కడం లేదు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. 4,000 మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో రేవంత్ రెడ్డికి ఓటమి భయం మొదలైంది.. అందుకే కో-ఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారు. దమ్ముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారు.

Also Read: Harish Rao: కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కాంగ్రెస్.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

సర్కార్ బండారాన్ని బయటపెడతాం

విద్యార్థి నాయకులను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనం అన్నారు. సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని స్వాగతిస్తున్నాం. కానీ వాస్తవాలు చెప్పడానికి బీఆర్ఎస్‌కు కూడా పిపిటి ఇచ్చే అవకాశం ఇవ్వాలన్నారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం మాకు ఇస్తూ మా గొంతు నొక్కుతున్నారు. మైకులు కట్ చేస్తున్నారని అవకాశం ఇస్తే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతాం అని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం కాదు.. ఒక కన్సల్టెన్సీ కంపెనీ. బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని విమర్శించారు.

రూ. 30 వేల కోట్ల అప్పు

అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి గతంలోనే రూ. 180 కోట్ల కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ. 30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణకు 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ రెడ్డి ఉత్తరం రాయడం చారిత్రక తప్పిదం. దానికి క్షమాపణ చెప్పి, వెంటనే 90 టీఎంసీల కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.

పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం

అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. ఈ సిట్ ఒక పెద్ద జోక్ అని అన్నారు. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం. ఏపీలో అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది. రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా గుంజుకొస్తాం అని హెచ్చరించారు. ఉద్యమంలో నాపై 300 కేసులు ఉన్నాయి. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడం డీజీపీ శివధర్ రెడ్డి కి ఫుట్‌బాల్ మ్యాచ్ రక్షణకే సమయం సరిపోతోందన్నారు. సంగారెడ్డి జిల్లా సర్జాపూర్‌లో ఓటేయలేదని దళితులపై దాడులు చేసి ఇళ్లు కూలగొట్టినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదు. ఖాకీ పుస్తకం, చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు.

దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ చేయలేదు 

కానిస్టేబుళ్ల ఆరోగ్య భద్రతను రూ. లక్షకు కుదించడం దుర్మార్గం. వారి టీఏ, డీఏ అలవెన్స్‌లపై డీజీపీ దృష్టి పెట్టాలని, దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ చేయలేదని యాదగిరిగుట్టలో వేడుకుంటే నాపై కేసు పెట్టారని, ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం తెచ్చిన వాళ్లం, త్యాగాల చరిత్ర మాది. రేవంత్ రెడ్డి అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Also Read: Harish Rao: రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: హరీష్ రావు

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!