tspsc logo
Politics

Group 4: గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. త్వరలో తుది జాబితా విడుదల

– సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సిద్ధం కావాలని సూచన
– వాయిదా పడ్డ పీజీఈసెట్ పరీక్ష
– ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్ల విడుదల

TSPSC: గ్రూప్-4 పరీక్షలు రాసి రాత పరీక్షలో ఎంపికై, తుదిజాబితా కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. 2024 ఫిబ్రవరి 9న విడుదల చేసిన గ్రూప్ – 4 అభ్యర్థుల ర్యాంకులను జనరల్ అభ్యర్థులను 1:3, PWD అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. అభ్యర్థులంతా EWS, కులం, నాన్ క్రిమిలేయర్, సంబంధిత స్టడీ సర్టిఫికెట్లు రెడీ చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వెరిఫికేషన్ సమయంలో వీటిలో ఏ ఒక్క సర్టిఫికెట్ సమర్పించకపోయినా అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది.

మరోవైపు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) నిర్వహించే పీజీఈసెట్ 2024 పరీక్షా తేదీలను వాయిదా వేసినట్టు పీజీఈసెట్ 2024 కన్వీనర్ డా. ఏ.అరుణ కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ పరీక్షలను జూన్ 10 నుండి 13 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇదివరకు జూన్ 6 నుండి 9 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినా.. చాలా మంది అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టీఎస్పీఎస్పీ గ్రూప్-1 పరీక్షలకు హాజరవుతున్నందున పరీక్ష తేదీలను మార్చినట్టు తెలిపారు.

Also Read: గౌతం గంభీర్ కు కీలక పదవి

అలాగే.. ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలు రాసేవారు బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, హాల్‌టికెట్ మీద విద్యార్థులు త‌మ ఫొటో, సంత‌కం, పేరు, మీడియంతో పాటు ఏయే స‌బ్జెక్టులు రాస్తున్నామో సరిచూసుకుని, వాటిలో ఏదైనా తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదిందించాలని అధికారులు సూచించారు. కాగా, హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్స్ సంత‌కాలు లేకున్నా పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు.. ఆయా సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వ‌ర‌కు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు, మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వ‌ర‌కు సెకండియ‌ర్ విద్యార్థుల‌ు పరీక్షలకు హాజరుకానున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!