Forward Bloc and Jagruti: మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్ లోనూ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షుడు కె.బుచ్చిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల (Kavitha) కవితతో భేటి అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, మున్సిపాలిటీల్లో అనుకూలతలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
Also Read: Telangana Jagruti: యువతకు కవిత పిలుపు.. జూన్ 2న పోటీలు.. మ్యాటర్ ఏంటంటే!
వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయబోతున్నట్లు తెలిపారు. జాగృతితో కలిసి రాష్ట్రంలో ముందుకు వెళ్తామని, అంశాల వారీగా ఉద్యమం చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటబోతున్నట్లు ప్రకటించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థుల పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కన్వీనర్ జోజిరెడ్డి, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సెంట్రల్ కమిటీ సభ్యులు ఆర్ వీఆర్ ప్రసాద్, తేజ్ దీప్ రెడ్డి, కొండ దయానంద్, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కె. నరేందర్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీరన్న, నల్గొండ ప్రధాన కార్యదర్శి రాము, ఐవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదిత్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Also Read: Telangana Jagruti: కవిత మీద అవాకులు పేలితే ఊరుకోబోం.. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్!

