Rachamallu Siva Prasad Reddy: ఆ మాజీ ఎమ్మెల్యే ఏది మాట్లాడిన ఫైర్ ఆన్ ది ఫైర్ కావాల్సిందే. ఇటీవల గళమెత్తి నినదిస్తూ తనదైన స్టైల్ లో వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. అది కూడా అందరి సంగతి చూస్తా అనే రేంజ్ లో తెగ సీరియస్ అవుతున్నారు. ఇంతకు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఏంటా సంగతి తెలుసుకుందాం.
కడప జిల్లా వాసులకు కాస్త పౌరుషం, మరికాస్త రోషం ఎక్కువే అంటుంటారు. అందుకేనేమో ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆగ్రహంతో ఉద్యోగాలు కూడా పీకేస్తా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీకి చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కోపంతో చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి. ఇంతకు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు.. ప్రొద్దుటూరుకు చెందిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనాల్సిందే. ఔను వారంలో ఒక్కసారైనా వీరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాల్సిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనేం చెప్పారంటే.. ఉపసర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులతో కలిసి ఎమ్మెల్యే అనుచరులు హింసకు పాల్పడ్డారన్నారు. టీడీపీకి మద్దతిచ్చిన పోలీసులను గుర్తుపెట్టుకుంటానని, జగన్ సీఎం అయ్యాక వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తానంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
అయితే ఈ కామెంట్స్ పై ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అంతేకాదు ఇటీవల రాచమల్లు మాట్లాడుతూ.. రాచమల్లుని చంపిన తర్వాతే.. ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలను, నాయకులను మీరు అగౌరవ పరచగలరు, నష్టపరచగలరు.. రాచమల్లు ప్రాణంతో ఉన్నంత వరకు అదీ జరగదు, జరగనివ్వను.. అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Also Read: Indian Navy: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. వెంటనే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి!
కాగా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని గోపవరం పంచాయతి ఉప-సర్పంచ్ ఎన్నిక సందర్భంగా అధికార టీడీపీ ఏమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, అతని అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఇటీవల మాజీ సీఎం జగన్ సైతం ఆరోపించారు. మొత్తం మీద కడప రాజకీయం తీరే వేరు. నిరంతరం రాజకీయం ఇక్కడ వాడీవేడీగా ఉండాల్సిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోపంతో పోలీసులను జాబ్స్ నుండి తీసివేస్తాం అంటూ చేసిన కామెంట్స్ వైరల్ కాగా, టిడిపికి చెందిన కొందరు, మీరు అధికారంలోకి రారు, అది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.