foreing investments pour in telangana | FDI: తెలంగాణకు పెట్టుబడుల వరద
Investments
Political News

FDI: తెలంగాణకు పెట్టుబడుల వరద

– ముందుకొచ్చిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ
– సచివాలయంలో సీఎంతో చర్చలు
– స్థిరాస్థి రంగంలో భాగ్యనగరం ముందంజ
– ప్రశంసించిన కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సంస్థ

Telangana: అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణను గమ్యంగా మార్చుతామని ప్రకటించి, ఆ దిశగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వపు కృషికి సత్ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గతంలో దావోస్‌లో తెలంగాణ ప్రతినిధిగా హాజరై ఏరోస్పేస్, మిలిటరీ సపోర్ట్, సెక్యూరిటీ, టెక్నాలజీస్ పరిశ్రమలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి, వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. నాటి ప్రతిపాదన మేరకు మంగళవారం సంస్థ ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి తాము తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఫెర్నాండెజ్‌ను ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు.

మరోవైపు.. స్థిరాస్థి అభివృద్ధి, సలహా సంస్థ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతోనూ సీఎం సచివాలయంలో భేటీ అయ్యారు. గ్లోబల్ ప్రమాణాలను పాటిస్తూ, నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం, మంత్రులు సంస్థ ప్రతినిధులకు వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారుకానుందని, విదేశాల్లోని ఉత్తమ నగరాల మాదిరిగా హైదరాబాద్ ఎదిగేందుకు తాము క‌ృషి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అటు.. గత ఆరు నెలల్లో రియాల్టీ, ఆఫీస్ లీజింగ్, వర్క్ స్పేస్, నిర్మాణ రంగం, నివాస గృహాల నిర్మాణం, కొనుగోళ్లలో హైదరాబాద్ మంచి వృద్ధిని నమోదు చేసిందని తమ అధ్యయనంలో వెల్లడి అయిందని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. తెలంగాణ నుంచి అమెరికాలో నివాసముంటున్న తెలంగాణ వాసుల సంఖ్య పెరుగుతోందని, తరచూ రెండు దేశాల మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోందని, కనుక.. న్యూయార్క్ మాదిరిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..