Bhatti released Stifund
Politics

Deputy CM Bhatti: పంద్రాగస్టు కంటే ముందే రైతు రుణమాఫీ

– అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు
– ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
– ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటాం
– ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
– గత పాలకులు రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు
– కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి

Kothagudem: ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం కొత్తగూడెం చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు ఇవ్వరు ఇవ్వరు అని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతు రుణమాఫీ చేయరు.. చేయరు.. అని ప్రచారం చేస్తున్నారని, కానీ, ప్రభుత్వం తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతుందని, అవసరమైతే ఆగస్టు కంటే ముందే చేసి చూపిస్తామని వివరించారు. ఇక రైతు భరోసా విషయానికి వస్తే.. ఎవరికి ఇవ్వాలి? ఎలా పంపిణీ చేయాలి అనేది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చకు పెట్టి చట్టం చేసి రైతులకు అందిస్తామని చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో గురువారం ఆయన పాల్గొన్నారు.

గత పాలకులు రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని, రూ. మిషన్ భగీరథ కోసం రూ. 42 వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెట్టినా ఇంటింటికి తాగు నీరు రాని పరిస్థితులు ఉన్నాయని భట్టీ తెలిపారు. తమ ప్రభుత్వం రూపాయి రూపాయి పోగు చేసి హేతుబద్ధంగా ఖర్చు చేస్తామని, సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని వెల్లడించారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సరఫరాకు రూ. 150 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి రూ. 150 కోట్లతో తాగు నీరు అందించాల్సి వచ్చిందని వివరించారు.

కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నిస్తానని భట్టి హామీ ఇచ్చారు. ఆర్‌వోబీ నిర్మాణానికి మంత్రి కోమడిరెడ్డి వెంకటరెడ్డి నిధులు కూడా మంజూరు చేశారని వివరించారు. రామగుండంలో సరిపడా స్థలం, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నందున సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు ఉన్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే కొత్తగూడెంలో ఐటీ హబ్ నిర్మాణానికి స్థలం ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తామని, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో మాట్లాడి ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 9,000 కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయిందని భట్టి విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సాగు నీటిని పారిస్తామన్నారు. రూ. 70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింక్ కెనాల్ అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగు ప్రాజెక్టుల వివరాలన్నింటినీ తెప్పించుకున్నామని, ఆరు నెలల్లో పూర్తి చేయగలిగేవి, ఏడాదిలో, మూడు సంవత్సరాల్లో, ఐదేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించామని, వాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామని చెప్పారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు