నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ స్పందించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్
Ex MP vinod kumar talk about NEET scam follow Tamilnadu:
రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు..మనం అదే బాటలో ముందుకు వెళ్దాం. అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..నీట్ పరీక్ష పేపర్ ఎప్పటి నుండి లీక్ అవుతుందో ఎవరికి తెలుసు, ఇవ్వాళ బయటపడింది కాబట్టి అందరికీ తెలిసింది. మన రాష్ట్రం నుండి నీట్ పరీక్ష రాసిన పిల్లలు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒక్కటే కోరుతున్నా నీట్ పరీక్ష పై మన పిల్లలకు లాభం జరుగుతుందా , నష్టం జరుగుతుందా ఎక్స్ పర్ట్ కమిటీ వెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.
నిపుణులతో కమిటీ వెయ్యండి
మన రాష్ట్రంలో వివిధ మెడికల్ కాలేజీలో ఎక్స్ పర్ట్ ప్రొఫెసర్ లు ఉన్నారు , వారితో ఒక కమిటీ వెయ్యండి. ప్రస్తుతం నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి. కొట్ల రూపాయిలు చేతులు మారాయి అని అంటున్నారు… దీని పై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు. కోట్ల రూపాయలు చేతులు మారితే ఈడీ ఏంటనే కేసు నమోదు చేస్తుంది….ఇప్పుడు ఎందుకు కేసు నమోదు చెయ్యలేదు అని అన్నారు.