ex ministers sabitha indrareddy and satyavathi rathod met brs mlc kavitha | MLC Kavitha: ఎలా ఉన్నారు.. మేడం!
ex ministers met kavitha
Political News

MLC Kavitha: ఎలా ఉన్నారు.. మేడం!

– తీహార్ జైలుకు మాజీ మంత్రులు
– కవితను కలిసి భరోసా
– ఈమధ్యే కలిసిన కేటీఆర్
– తాజాగా సత్యవతి రాథోడ్, సభితా ఇంద్రారెడ్డి భేటీ

BRS Leader: లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిశారు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రీసెంట్‌గా కవితను ఆమె సోదరుడు కేటీఆర్ కలిశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు జులై 3 వరకూ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న అధికారులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. జూన్ 15తో కవిత అరెస్టయి 3 నెలలు అయింది. రెండు దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.

14 రోజులకు ఒకసారి కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తూ వస్తుంది. తీహార్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో కవిత గడుపుతున్నారు. ఈడీ, సీబీఐ అరెస్ట్‌లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యూలర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా, న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇదిలాఉంటే కవితతో ఆమె భర్త అనిల్ వారానికి రెండు సార్లు ములాఖత్ అవుతున్నారు. ప్రతిరోజు ఐదు నిమిషాలు ఫోన్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు.

Just In

01

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్