- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
- పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం
- రాష్ట్రం ఏర్పాటు అయినా కొన్ని అంశాలు పరిష్కారం కాలేదు
- 9 షెడ్యుల్ ఉన్న 30 సంస్థల సమస్యలు పరిష్కారం కాలేదు
- 10 షెడ్యుల్ 102 సంస్థకు పరిష్కారం కాలేదు
- కెసిఆర్ అధికారంలో రాగానే ఆంధ్ర ప్రజలను చక్కగా చూసుకున్నాం
- త్యాగాల అర్పించిన అమరుల త్యాగాలు మర్చిపోలేనివి
Ex minister Srinivas Gowd media meeting against congress:
అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ ప్రయోజనాలు కాదు..రాష్ట్ర ప్రయోజనాలకే తమ ప్రాధాన్యత ..కొందరి ప్రయోజనాలు కోసం నిర్లక్ష్యం చేస్తే మేము ఊరుకోం. అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్ళు, నీధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయం పై జరిగిందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయినా కానీ కొన్ని అంశాలు పరిష్కారం కానివి ఉన్నాయన్నారు. 9 షెడ్యుల్ ఉన్న 30 సంస్థల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. పరిష్కారం కానివి ఏంటని ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆంధ్రా వాళ్లను కూడా బాగా చూసుకున్నాం
9 షెడ్యుల్, 10 షెడ్యూల్ ఉన్నటువంటి పరిష్కారం కాని సంస్థలను ఏంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రాలు విడిపోయిన తరువాత హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రజలను వెళ్లగొడుతారు అని ప్రచారం చేశారని.. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రజలను బాగా చూసుకున్నామని తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగాలు మర్చిపోలేనివని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకం లేకుండా పరిష్కారం చేసుకోని ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకొని వెళ్ళాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదని, కొందరి ప్రయోజనాలు కోసం నిర్లక్ష్యం చేస్తే తాము ఊరుకోమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు.