KRT fire on congress
Politics

Hyderabad:లా అండ్ ఆర్డర్ ఎక్కడ?

మెదక్ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందన

Ex minister KTR criticise the congress government about law and order:
మెదక్ లో చోటు చేసుకున్న ఘర్షణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలాంటి మత పరమైన ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లా అండ్ ఆర్డర్ ఎక్కడకి పోయింది. అసలు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ పట్ణం కాస్తా ఇప్పుడు అస్తవ్యస్తంగా మారడం నిజంగా సిగ్గుచేటన్నారు.

బీజేపీ బంద్ ప్రశాంతం

మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ బంద్ కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతువధపై శనివారం రాత్రి మెదక్ టౌన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఈ గొడవ నేపథ్యంలో ఆదివారం మెదక్ పట్టణం బంద్ కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఇక బంద్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మెదక్ టౌన్ కు అదనపు బలగాలను తరలించి ప్రధాన కూడళ్లలో మోహరించారు. ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఎస్పీ బాల స్వామితో పాటు ఇతర పోలీస్ అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ లో ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఉంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?