harish rao job calender
Politics

Harish Rao: గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా రాలేదు

– జీపీ కార్మికులకు, ఆశా వర్కర్లకు జీతాల్లేవ్
– రైతు బంధు పంట పండినాక ఇస్తారా?
– సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

Rythu Bandhu: బీఆర్ఎస్ హాయంలో పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయని, కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా రాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వడం లేదని, ఎనిమిది నెలల జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయని వివరించారు. ఆశా వర్కింగ్ సిబ్బందికి జీతాలు రావట్లేదన్నారు. సకి సెంటర్స్‌లో 1142 కేసుల్లో 1122 కేసులు పూర్తయ్యాయని, ఏడు నెలల నుంచి వీరికి జీతాలు రావడం లేదని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకూ నాలుగు నెలల జీతాలు వేయలేదని పేర్కొన్నారు. ఇక వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్లు రావడం లేదని చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి పింఛన్లు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పింఛన్‌ను రూ. 2000 నుంచి రూ. 4000కు పెంచి ఇస్తామని చెప్పారని, కానీ, ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా రూ. 2000 పింఛన్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిద్ధిపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతు భరోసా విధి విధానాలు ఏమిటనీ అడిగారు. రైతులకు పంట పెట్టుబడిగా రైతు బంధు ఇవ్వాలనే నిర్ణయం తాము చేశామని, అలాగే అమలు చేశామని వివరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు డబ్బులే అందరికీ పడటం లేదని, కొందరికి ఆ డబ్బులు వేసినా పంట కాలానికి సంబంధం లేకుండా వేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పంటకు ముందు ఇస్తారా? లేక పంట అయ్యాక వేస్తారా? అని అడిగారు.

కాళేశ్వరం కాలువలలో మట్టి పడి గడ్డి మొలిసిందని మాజీ మంత్రి అన్నారు. నీటి విడుదలలో ఇబ్బంది ఉంది కనుక వాటిని శుద్ధి చేయాలని సూచించారు. స్కూల్ యూనిఫామ్స్ సిద్దిపేట జిల్లా పాఠశాలలకు అందలేదని, వెంటనే వాటిని అందించాలని కలెక్టర్‌ను కోరారు. జీరో బిల్లులు ఎంత మందికి వచ్చాయని ప్రశ్నిస్తూ.. పేదలకు, తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. ఒక వేళ 201 యూనిట్ల బిల్లు వస్తే ఫ్రీ ఇవ్వరా? అని పేర్కొంటూ.. ఒక వేళ సమయానికి రీడింగ్ తీయకపోతే అది ఎవరి తప్పు అవుతుందని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా మూడు నాలుగు రోజులుగా రాత్రిళ్లు రావడం లేదని ఆరోపించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు