MLC Elections
Politics

MLC Elections: నోట్లిస్తేనే ఓట్లు.. ప్రలోభాల పర్వం షురూ

– ఓటుకు 2 నుంచి 3 వేలు ఆశిస్తున్న పట్టభద్రులు
– గ్రూపులుగా ఏర్పడి డబ్బులు డిమాండ్​!
– పైసలిస్తే గుంపగుత్తగా ఓట్లు వేస్తామంటూ ఆఫర్లు!
– పైసల పంపిణీకి ప్రత్యేక వ్యవస్థ.. స్థానిక నేతలను నమ్మని అభ్యర్థులు

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో ప్రలోభాల పర్వం జోరందుకున్నది. ఎంత ప్రచారం చేసినా.. ఎన్ని హామీలు ఇచ్చినా చివరకు డబ్బులు పంపిణీ చేయకపోతే ఓట్లు రాలవని అభ్యర్థులకు అర్థమైపోయినట్టుంది. మరోవైపు ఓటర్లు కూడా నేతలు ఇచ్చే డబ్బుల కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. గ్రూపులుగా ఏర్పడి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ‘మా గ్రూప్ లో మొత్తం 20 మంది ఓటర్లం ఉన్నాం.. మా అందరికీ కలిపి డబ్బు ఇస్తే మీకే ఓటు వేస్తాం’ అంటూ అభ్యర్థులకు ఆఫర్ ఇస్తున్నారట.

ముగుస్తున్న ప్రచార గడువు

ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రాజకీయపార్టీలతోపాటు ఇండిపెండెంట్లు సైతం భారీగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్​, మెదక్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనున్నది. 25 సాయంత్రానికి ప్రచార గడువు ముగియనున్నది. దీంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.

పట్టభద్రుల గ్రూపులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వారు గ్రూపులుగా ఏర్పడి మీటింగ్‌లు పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఒక్క గ్రూపులో 20 మంది నుంచి 30 మంది గ్రూపుగా ఏర్పడి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారట. ఓటరు క్రమసంఖ్య, పోలింగ్ కేంద్రం, నంబర్ వంటి వివరాలు సేకరించి స్థానిక లీడర్లకు సమాచారం అందిస్తున్నారట. తమ గ్రూపులో ఓటుకు 2 నుంచి 3 వేల రూపాయల వరకు డబ్బులు ఇస్తే గుంపగుత్తగా ఓటు వేస్తామంటూ అభ్యర్థులు, వారి అనుచరులకు తెగేసి చెబుతున్నారట.

పైసల పంపిణీకి ప్రత్యేక టీమ్‌లు

అభ్యర్థులు ఎంత ప్రచారం చేసినా.. పోల్ మేనేజ్‌మెంట్ ఎంతో కీలకం కానున్నది. ఓటరును పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు వేయించడమే పెద్ద టాస్క్. చివరినిమిషంలో కచ్చితంగా ప్రలోభాల పర్వం కీలకం కానున్నది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మండల నాయకులు, స్థానిక నాయకులను నమ్మకుండా డబ్బు పంపిణీ కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. లోకల్ లీడర్ల చేతికి డబ్బులు ఇస్తే ఓటర్ల దాకా చేరుతాయో లేదో అని అనుమానిస్తున్న అభ్యర్థులు ప్రత్యేకంగా టీమ్ లను ఏర్పాటు చేసుకుంటున్నారట. 25న ప్రచారం ముగియనుండటంతో భారీస్థాయిలో ప్రచారపర్వానికి తెరలేవనున్నది.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు