- మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న దానం నాగేందర్
- బీఆర్ఎస్ ను వీడేందుకు మరికొందరు నేతలు సిద్ధం
- పోచారమే కాదు మిగిలిన నేతలంతా కాంగ్రెస్ వైపే
- గ్రేటర్ హైదరాబాద్ నేతలంతా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం
- హరీష్ రావు చూపు బీజేపీ వైపు
- గందరగోళంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు
- కాంగ్రెస్ పార్టీ టచ్ లో 20 మంది బీఆర్ఎస్ నేతలు
Danam Nagendar says 20 above brs leaders join in congress party:
కాంగ్రెస్ పార్టీలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారని సంచలన కామెంట్స్ చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. శుక్రవారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న దానం నాగేందర్ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవబోతోందని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంతో ఉన్నారని అందుకే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీనుంచి వలసలు వచ్చేవారంతా కేసీఆర్ విధానాలు నచ్చకే బయటకొస్తున్నామని చెబుతున్నారు. చివరాఖరుకు కేసీఆర్, కేటీఆర్, పల్లా , ప్రశాంత్ రెడ్డి , హరీష్ రావు, తప్ప ఆ పార్టీలో నేతలెవ్వరూ ఉండరని దానం నాగేందర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ గురించి మాట్లాడుతూ పోచారమే కాదు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అన్నారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ప్రజాప్రతినిదులంతా కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.
అయోమయంలో ద్వితీయ శ్రేణి నేతలు
కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక ఉంటుందని దానం నాగేందర్ స్పష్టం చేశారు. వీరితో పాటు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీలోకి వచ్చే వలసల పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు, సీఎంలు కలిసి రెండు మూడు రోజులుగా ఈ విషయంపైనే చర్చించారని..వలసలై చట్టపరమైన ఆటంకాలు, చేరికలపై కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభనష్టాలపై ఇద్దరూ కలిసి కీలక అంశాలు ప్రస్థావించారని అన్నారు. హరీష్ రావు, మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని దానం నాగేందర్ అన్నారు. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు అయోమయంలో పడ్డారని…మరికొందరు పార్టీని వీడే విషయంలో సంధిగ్దతతో ఉన్నారని దానం నాగేందర్ అన్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమే అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, పార్లమెంట్ ఫలితాలను చూసి బీఆర్ఎస్ పార్టీతో ఇక లాభం లేదని కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడుతున్నారని అన్నారు.