Bhadradri thermal power plant
Politics

BTPS: దర్యాప్తు.. స్పీడప్! పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు

– నిజానిజాలు నిగ్గు తేల్చనున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్
– వివరాల కోసం బహిరంగ ప్రకటన

Thermal Power Plant: బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలున్నాయి. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ నేతలు అనేక విమర్శలు చేశారు. అలాగే, ఛత్తీస్‌ గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందాలపైనా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై నిజానిజాలు తేల్చేందుకు మార్చి నెలలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది.

తాజాగా, విచారణలో భాగంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్‌ గఢ్ విద్యుత్ ఒప్పందాలపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే పది రోజుల్లో అందించాలని బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. మణుగూరు సమీపంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించడానికి అత్యంత ప్రభావవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీని వినియోగించారని, రెండేళ్ల కాల వ్యవధి సరిపోతుండగా దాన్ని అధిక మూల వ్యయంతో ఎక్కువ కాలం అంటే 7 సంవత్సరాల వరకు తీసుకోవడానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని కమిషన్ పేర్కొంది. బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ కాకుండా పూర్తిగా నామినేషన్ ప్రాతిపదికన ఈపీసీకి కాంట్రాక్ట్ అందించడంపైనా ఆరోపణలను ప్రస్తావించింది. అలాగే, డిస్కమ్స్ నుంచి ఎక్కువ వ్యయానికి కారణమవుతూ 179 నుంచి 388 కిలోమీటర్ల దూరంలో గల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరాతో దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను ఎందుకు స్థాపించారని, ఇందులోనూ బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ కాకుండా ఎందుకు నామినేషన్ ప్రాతిపదికను సదరు యూనిట్ స్థాపనకు ఈపీసీకి కాంట్రాక్ట్ అందించారని అడిగింది.

Also Read: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న పుష్ప ఎడిటర్‌

వీటితోపాటు ఛత్తీస్‌ గఢ్ రాష్ట్ర డిస్కమ్స్ నుంచి విద్యుత్ సేకరణకు బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ అనుసరించలేదని కమిషన్ పేర్కొంది. కాంట్రాక్ట్ చేసుకున్న కెపాసిటీకి చాలా తక్కువ విద్యుత్ షెడ్యూలింగ్ అయినప్పటికీ పూర్తి కాంట్రాక్ట్ కెపాసిటీ అంటే 1000 మెగా వాట్ల కొరకు కారిడార్‌కు సంబంధించి పీజీసీఐఎల్‌కు పూర్తి చెల్లింపులు జరిపారని వివరించింది. వీటిపైనా దర్యాప్తు చేపడుతున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి వివరాలు తెలిసినా లేదా అవగాహన ఉన్న వ్యక్తులు, సంస్థలు, నిపుణులు పది రోజుల్లోగా coi2024.power@gmail.comకు ఈమెయిల్ లేదా బీఆర్కే భవన్‌లో 7వ అంతస్తులోని కమిషన్ కార్యాలయానికి వచ్చి లేదా తపాలా ద్వారా బట్వాడా కూడా చేయవచ్చునని సూచించింది. మౌఖిక సాక్ష్యాలు ఇవ్వాలనుకుంటే తమకు ఆ విషయాన్ని తెలియజేస్తే, అభ్యర్థనను పరిశీలించి నిర్ణయాన్ని కమిషన్ తెలియజేస్తుందని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటనలో వెల్లడించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!