MP Chamala Kiran Kumar: ఏపీ పునర్విభజన ప్రకారం తెలంగాణకు నీళ్లు రావాల్సిందేనని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై గతంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని ఎంపీ చామల వివరించారు. కానీ కేంద్రం డబుల్ గేమ్ ఆడుతుందని ఆయన మండిపడ్డారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలు రావాల్సిందేనని నొక్కి చెప్పారు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు, అనుమానాలు అవసరం లేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టు పై జనవరి 22న 2025 న జలశక్తికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసి, నీటి వాటాలపై స్పష్టంగా వివరించారన్నారు. అంతేగాక జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో జలశక్తి మంత్రిని కలిసి ఏపీ ప్రాజెక్టు కడుతున్నట్లు వివరించారన్నారు.
మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత
జూన్ 13 న కూడా మరొక సారి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఇదే అంశంపై ప్రత్యేకంగా కలిసి డిస్కషన్ చేశారన్నారు. కానీ కేంద్రం అంటిముట్టనట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. బనకచర్లపై కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించట్లేదన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నా బీజేపీ నేతలు బనకచర్లపై ఎందుకు మాట్లాటడం లేదని నిలదీశారు. కృష్ణ జలాలు, గోదావరి జలాలపై తెలంగాణ వాటా కోసం మాట్లాడాల్సిన భాద్యత ఎంపీలుగా తమకు బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు.
Also Read: Minister Seethaka: ఏడాదిలో 1440 అంగన్వాడి భవనాలను నిర్మిస్తాం.. మంత్రి వెల్లడి
తెలంగాణలో నీళ్ల సమస్య ఎక్కువ
ఇక 1980 ప్రకారం నిర్ణయాలు తీసుకునే ముందు పొందు పరిచిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర జలశక్తికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని ఎంపీ వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని, కానీ పదేళ్లలో ఆ ఏజెండా నిర్వీర్య మైందన్నారు. ఇప్పుడే తెలంగాణలో నీళ్ల సమస్య ఎక్కువగా ఉన్నదన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్‌లు పెట్టి వివరించడం గొప్ప విషయమన్నారు. గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం కడుతున్న బనక చర్ల ప్రాజెక్టుపై అవగాహన కల్పించడం మంచి పరిణామం అంటూ పేర్కొన్నారు. తెలంగాణకు నీటి నష్టాలు రాకుండా బీజేపీ ఎంపీలు కూడా తమతో కలిసి రావాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.
Also Read: Minister Ponnam Prabhakar: గోల్కొండ బోనాలకు.. పకడ్బందీ ఏర్పాట్లు!