Telangana Phone Tapping Case Files
Politics

Phone Tapping: ‘అంత తొందరెందుకు..? గుమ్మడికాయల దొంగల కేటీఆర్ తీరు’

– కల్వకుంట్ల ఆస్తులపై లై డిటెక్టర్ టెస్ట్‌కి సిద్ధమా?
– టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలింపుపై మౌనం ఎందుకు?
– పోలీసులు కూపీ లాగుతున్నారు
– త్వరలోనే అన్నీ బయటకొస్తాయి
– కేటీఆర్ తీరు గుమ్మడికాయల దొంగలా ఉంది
– కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం సెటైర్లు

మహబూబ్ నగర్, స్వేచ్ఛ: స్వాతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేయని అవినీతి, అక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మేనేజ్మెంట్ కోటా ఎంఎల్ఏ కేటీఆర్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంది బురదలో దొర్లి ఆ బురదను వేరే వాళ్లకు అంటించేందుకు యత్నించినట్లు.. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తాము చేసినవి కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీ అంటూనే, కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదని, స్వేచ్ఛ ఉంటుందని, ఏదైనా నేరుగా మాట్లాడుకుంటామని తెలిపారు. ఏ ఆధారాలతో రేవంత్ డిల్లీకి డబ్బులు పంపారని అంటున్నారో చెప్పాలన్నారు. కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఫిర్యాదులు చేస్తుంటే, గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారని కేటీఆర్‌పై మండిపడ్డారు శ్రీనివాస్ రెడ్డి. పదేళ్లు కేసీఆర్‌కు తెలియకుండా తెలంగాణలో చీమ చిటుక్కుమందా, అలాంటప్పుడు వాళ్లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా? అని అన్నారు. అమెరికా నుండి వచ్చినప్పుడు కేటీఆర్ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని? అవన్నీ నిజాయితీగా పెరిగాయా, వాటిపై లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ కౌంటర్ సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడకుండా బట్టకాల్చి మీద వేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాధా కిషన్ రావు అన్ని విషయాలు చెప్తున్నారని, కల్వకుంట్ల కుటుంబం ఫోన్ ట్యాపింగ్‌లో ఇన్వాల్వ్ అయి ఉందని సిట్ ఆధారాలు సేకరించిందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో అభ్యర్థులకు ఎన్ని కోట్ల రూపాయలను తరలించారు అనే విషయం తేలాల్సి ఉందని, దానిపై కూడా ఎంక్వైరీ జరుగుతుందని స్పష్టం చేశారు. అది నిజమని తేలితే మీ అందరి సభ్యత్వాలు రద్దు అవుతాయని కేటీఆర్‌ను హెచ్చరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!