Rachandan Rao: యూరియా కొరత అంటూ అసత్య ప్రచారం..
Ramachandra Rao(IMAGE credit: swetcha reporter)
Political News

Ramachandra Rao: యూరియా కొరత అంటూ అసత్య ప్రచారం.. నిజమైతే తుమ్మల రాజీనామా చేస్తారా?

Ramachandra Rao: కాంగ్రెస్ అంటేనే ‘మదర్ ఆఫ్ ఆల్ లై’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramachandra Rao) విమర్శలు చేశారు. నిజాన్ని కూడా అబద్ధమని నమ్మించే వ్యక్తులు కాంగ్రెస్ నేతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా(Urea)పై కేంద్రంపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కేంద్రం ఎక్కడా యూరియా(Urea)షార్టేజ్ చేయలేదని తెలిపారు. దీనిపై చర్చకు సిద్ధమని గతంలోనే సవాల్ విసిరానని గుర్తు చేశారు. రబీ సీజన్‌కు ఇచ్చిన యూరియా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇంకా స్టాక్ ఉందని తెలిపారు. మళ్లీ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన యూరియాను కూడా కేంద్రం ఇచ్చిందని తెలిపారు.

 Also Read: Ramchandra Rao: అన్యాయం జరిగితే పోరాటమే మార్గం: రాంచందర్ రావు

కుట్ర పూరితంగా ఎరువుల కొరత అంటూ ప్రచారం చేస్తున్నారని రాంచందర్ రావు(Ramachandra Rao:) ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ, అసత్యపు ప్రచారంతో ఎరువుల కొరత ఏర్పడిందని చురకలంటించారు. కాంగ్రెస్‌కు నీతి, నిజాయితీ ఉంటే కొరతపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామగుండం, చెన్నై ఫెర్టిలైజర్లు పని చేయడం లేదని, ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. యుద్ధాల కారణంగా దిగుమతులు నిలిచిపోయాయని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఎన్ని కష్టాలు ఉన్నా సీజన్‌కు సరిపడా యూరియా కేంద్రం సప్లయ్ చేసిందని వెల్లడించారు. యూరియాను ఎవరైనా తిన్నారా అంటూ రాంచందర్ రావు ధ్వజమెత్తారు.

రాజీనామాకు కూడా సిద్ధం

గతేడాది కంటే ఈ ఏడాది ఖమ్మంలో యూరియా ఎక్కువ వాడుతున్నారని, ఎందుకు అక్కడ వాడకం పెరిగిందని ప్రశ్నించారు. మంత్రుల వల్లే కృత్రిమ యూరియా కొరత ఏర్పడిందని పరోక్షంగా మంత్రి తుమ్మలపై రాంచందర్ రావు(Ramachandra Rao) విమర్శలు చేశారు. యూరియా అంశంపై తాను చెప్పిన దాంట్లో తప్పుంటే రాజీనామాకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతిగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి దత్తాత్రేయ పేరును ప్రతిపాదించారని, మరి ఇప్పుడు వీ హనుమంత్ రావు లాంటి సీనియర్ల పేరును హైకమాండ్‌కు ప్రపోజల్ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డిని ఎందుకు పెట్టారో చెప్పాలని నిలదీశారు.

సీపీ రాధాకృష్ణన్ ఒక ఎంబీసీ అని, బీసీల గురించి మాట్లాడే వారంతా ఆత్మప్రబోధన చేసుకొని ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. గో బ్యాక్ మార్వాడీ తప్పుడు నినాదమని, దేశంలో ఎవరు ఎక్కడైనా జీవించొచ్చన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ఉద్యమం వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నినాదాలు ఎవరు తీసుకున్నా మంచిది కాదన్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ తోనే గోబ్యాక్ మార్వాడీ ఉద్యమం పెరిగిపోతోందన్నారు.

 Also Read: Heavy Rains: భారీ వర్షాలు.. సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం