Politics

Telangana : కాంగ్రెస్ ‘గల్ఫ్’గోల్

  • గల్ఫ్‌‌ కార్మికులను పట్టించుకోని బీఆర్ఎస్ పాలకులు
  • వారి పక్షాన ఏనాడూ మాట్లాడని బీజేపీ
  • గల్ఫ్‌‌ పాలసీని గాలికొదిలేసిన బీఆర్ఎస్
  • కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌లో
  • గల్ఫ్‌‌ ఓటరు ప్రభావం ఎక్కువ
  • కార్మికుల వెల్ఫేర్‌‌ బోర్డు, బీమాకు సీఎం రేవంత్‌‌ హామీ
  • సెప్టెంబర్ 17 లోగా వారి సమస్యలను పరిష్కరిస్తామన్న సీఎం రేవంత్
  • తమకే కలిసొస్తుందని కాంగ్రెస్‌‌ లీడర్ల ఆశ

Gulf labour support Congress Reventh reddy :

గల్ఫ్‌‌ కార్మికులు ఎక్కువగా ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలలో గల్ఫ్ కార్మికులు వారి కుటుంబాల ప్రభావం పడనుంది. ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఇప్పుడు ఈ కార్మికులు తమ ఓటు ద్వారా ఝలక్ ఇవ్వనున్నారు. అయితే గల్ఫ్‌‌ కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి మూడు పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పదేళ్లుగా వీళ్లకు అన్యాయమే జరుగుతోంది. నామ మాత్రంగా పాలసీ ఉన్నా దానికి ఫండ్స్ ఇవ్వలేదు సరికదా గల్ఫ్ దేశాలలో కార్మికులు చనిపోతున్నా వారి బాధ అరణ్య రోదనే అయింది. ఇక తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఏనాడూ గల్ఫ్ కార్మికుల పక్షాన పోరాడలేదు. కనీసం వాళ్లు అక్కడ ఎలా జీవిస్తున్నారో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ రెండు పార్టీలపై అసంతృప్తితో ఉన్న కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌‌ నేతలు ప్లాన్‌‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా గల్ఫ్‌‌ బాధితులకు నష్ట పరిహారాలు చెల్లిస్తూ దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు.

తెలంగాణ నుంచి 15 లక్షల కార్మికులు

భారత విదేశాంగ శాక లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన సుమారు 15 లక్షల మందికి పైగా గల్ఫ్ దేశాలలో ఉంటున్నారు. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణకు చెందిన వారు దాదాపు 10 లక్షల మంది దాకా ఉంటారు. వీళ్ల కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే సుమారు కోటికి పైగా ఓట్లు ఉంటాయి. కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 8 శాతం నుంచి 22 శాతంగా ఓటు బ్యాంక్‌‌ వీరిదే ఉన్నట్లు తెలుస్తోంది. గల్ఫ్‌‌ జేఏసీ నేతలు నిర్వహించిన సర్వేలో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పార్లమెంట్‌‌ పరిధిలో గల్ఫ్ ఓటు ప్రభావితం చేసే ప్రాంతాలను అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఏ-1, ఏ-2 కేటగిరిలుగా గుర్తించారు.

కార్మికులను వంచించిన బీఆర్ఎస్

2008 ఏప్రిల్ 27న సికింద్రాబాద్‌‌లో నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ ఏడో ప్లీనరీలో ఎన్‌‌ఆర్‌‌ఐ సెల్‌‌ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని కేసీఆర్‌‌ డిమాండ్‌‌ చేశారు. గల్ఫ్‌‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌‌గ్రేషియా, ఎన్‌‌ఆర్‌‌ఐ పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశం, గల్ఫ్‌‌లో చనిపోయిన వారి మృతదేహాలను తెప్పించేందుకు మానిటరింగ్‌‌ సెల్‌‌ ఏర్పాటు చేయాలని కోరారు.
అనంతరం ఆయా హామీలు తాము అమలు చేస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్‌‌ గల్ఫ్‌‌ కార్మికులకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. దీంతో 24 గల్ఫ్‌‌ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గల్ఫ్‌‌ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల తరఫున, ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ ఓటు బ్యాంక్‌‌పై తీవ్ర ప్రభావం చూపింది.

కాంగ్రెస్ వైపే మొగ్గు

కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. గల్ఫ్‌‌లో చనిపోయిన కార్మికుల ఫ్యామిలీలకు రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో కాంగ్రెస్‌‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎక్స్‌‌గ్రేషియా చెల్లింపును వేములవాడలో చేపట్టడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల ఫ్యామిలీలకు రూ.5 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇచ్చే జీవో విడుదలపై కసరత్తు చేయాలని సీఎం సెక్రటరీ షానవాజ్‌‌ ఖాసీంకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కార్మికుల వెల్ఫేర్‌‌ బోర్డుకు సైతం హామీ ఇవ్వడంతో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు తమకు పడుతాయని ఆ పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!