congress counter attack ktr
Politics

Hyderabad:కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ‘ట్వీట్’మెంట్

Congress government tweets against ktr coments on state law and order:

అధికారంలో లేకపోయినా సందు దొరికితే చాలు కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నాయని..అదంతా శాంతిభధ్రతల వైఫల్యం అని కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు. పోలీసులకు సైతం రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ కూడా కేటీఆర్ ను ట్విట్టర్ వేదికగా కడిగిపారేసింది. ‘ప్రజల ఇంటికి నిప్పంటించి చలి కాచుకోవాలని చూడకు కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు విమర్శలు చేయాలనే కుట్రలు మానుకోమని’ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. . మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మిమ్మల్ని తెలంగాణ సమాజం ఛీ కొట్టి చిప్ప చేతిలో పెట్టిందని విమర్శలు చేసింది.

తెలంగాణ ఇమేజ్ ని డ్యామేజ్ చేయొద్దు

కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు విమర్శలు చేయాలనే కుట్రతో హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూడొద్దని, మీ పై వస్తున్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజా ప్రభుత్వం పై కుట్రలు చేయడం మానుకోవాలని సూచించింది. మియాపూర్ లోని ఆ భూమిని గత పదేళ్లు అధికారంలో ఉండి కూడా మీ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించలేదని విమర్శలు చేసింది. అక్కడికి వచ్చిన ప్రజలెవరూ స్థానికులు కాదని, సుదూర ప్రాంతాల నుండి అక్కడికి వచ్చారని. ప్రజా ప్రభుత్వం దీని వెనుక ఉన్న కుట్రలు ఛేదించి.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతుందని తెలిపింది. కావాలనే కొంతమంది వాట్స్ ఆప్ గ్రూప్ ల ద్వారా తప్పుడు సమాచారాన్ని చెరవేశారని, వారిని పోలీసులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేసింది.

డబుల్ డ్రామాలు

అలాగే కేసీఆర్ హయంలో పేద ప్రజలకు భూములు ఇవ్వలేదన్నది నిజమైందని, పైగా వారి భూములు లాక్కొన్నారని రుజువైందని, దీంతో డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదన్న నిజం బట్టబయలైందని కాంగ్రెస్ రాసుకొచ్చింది. కాగా బీఆర్ఎస్ పార్టీ మియాపూర్ ప్రభుత్వ భూముల ఘటనపై స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం చెందిందని ఆరోపించింది. అంతేగాక గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో.. కాంగ్రెస్ అసమర్థ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని, హైదరాబాద్ లోని మియాపూర్‌లో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని ట్వీట్ చేసింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!