- శనివారం వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- మధ్యాహ్నం 12.40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి పయనం
- 1.30 కి వరంగల్ కు చేరుకోనున్న సీఎం
- పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
- రాత్రి 7:20కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరిక Cm Reventh visiting Warangal afternoon shedule శనివారం వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 1.30 కి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లు వహించనున్న గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు
మధ్యాహ్నం 12:40కి హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు. 1:30 నిమిషాలకు వరంగల్ మేఘ టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుంటారు. 1:30 నుంచి 1:50 వరకు టెక్స్ టైల్ పార్క్ సందర్శించి కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన చేస్తారు. 1:50 అక్కడి నుంచి బయల్దేరి రంగంపేట మల్టీస్పెషలిటీ ఆస్పత్రి వద్దకు వెళ్తారు. 2:10 నుంచి 2:30 వరకు మల్టీస్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు. 2: 30కు హనుమకొండ సూపర్ స్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు. 2:45కు వరంగల్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ఓపెన్ చేస్తారు. 3:00 నుంచి 5:30 వరకు గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపడతారు. సాయత్రం 5:40కి ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 6:30 హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 7:20కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.