CM Reventh reddy meet Governor at Raj bhavan about state issues
పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో రెండు నెలలు పాలనకు దూరంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ వరుస సమీక్షలతో బిజీగా మారారు. ఇకపైపరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. . ఇరిగేషన్, విద్యుత్, త్రాగునీటి సరఫరా, విద్య, గ్యారంటీలతో పాటు హామీలు అమలు, విధివిధానాల రూపకల్పన, వీటికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ తదితరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నది. ఇందులో భాగంగానే రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో చర్చించారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశంపైనా చర్చించినట్లు సమాచారం.
పెండింగ్ బిల్లులపైనే చర్చ
బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్, సీఎం చర్చించారని తెలుస్తోంది. మధ్యాహ్నం గవర్నర్ తో కలిసి లంచ్ చేశారు.కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరిపినట్లు సమాచారం. . ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్‌తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గత మూడు రోజులుగా కాంగ్రెస్ పెద్దలతో పాటు, పలువురి కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.. పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించారు. ఇవే అంశాలపై సోమవారం గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది.