- పార్లమెంట్ ఎన్నికల తర్వాత సేఫ్ జోన్ లో సీఎం
- రెండు మూడు నెలలలో సీఎం మారతారని ప్రచారం
- పనిగట్టుకుని విద్వేషం కక్కిన ప్రతిపక్షాలు
- పార్లమెంట్ లో సగం స్థానాలు దక్కించుకున్న రేవంత్
- బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తోనే బీజేపీకి పెరిగిన బలం
- రేవంత్ కష్టాన్ని గుర్తించిన అధిష్టానం
- ఇప్పట్లో సీఎం పదవికి వచ్చిన నష్టం ఏమీ లేదు
- పార్లమెంట్ ఎన్నికల ఫలితాల టెస్ట్ లో పాస్ మార్కులు
- పాలనపై ఫోకస్ పెంచిన సీఎం
CM Reventh came safe jone after parliament elections congress 50% seats:
అసెంబ్లీ ఎన్నికలలో అసలు కాంగ్రెస్ గెలుస్తుందా అన్న వాళ్ల దిమ్మదిరిగేలా అధికారం వచ్చేలా చేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మార్పు ఉంటుందని ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేశాయి. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టే రేవంత్ సర్కార్ మనుగడ ఉంటుందని సొంత పార్టీలో కొందరు నేతలు బాహాటంగానే విమర్శలకు దిగారు. ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి పడ్డ కష్టం అందరికీ తెలిసొచ్చింది. ఊహించినంత మెజారిటీ రాకున్నా దాదాపు సగానికి సగం స్థానాలను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. అయితే మిగిలిన స్థానాలలో బీజేపీ అంతలా బలపడటానికి బీఆర్ఎస్ కారణమన్న సంగతి ఇప్పటికే అందరికీ అర్థం అయింది. రేవంత్ రెడ్డి మాత్రం తన ప్రయత్నాన్ని నిబద్ధతతో చేసినట్లు కనిపిస్తోంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన టెస్ట్ లో రేవంత్ రెడ్డి పాస్ మార్కులు తెచ్చుకోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లయింది.
ప్రభుత్వ వ్యతిరేకత లేదు
అనుకున్న ఫలితాలు సాధించకపోయినా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని స్పష్టం అవుతోంది. ఇక ఇప్పట్లో ఆ పార్టీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం బీజేపీతో సమానంగా సీట్లు తెచ్చుకోవడమే కాదు కేంద్రంలో బీజేపీ కి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం కూడా ఓ కారణమని అంచనా వేస్తున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఫలితాలు ఇబ్బందికరమే. ఆయనపై హైకమాండ్ కు పార్టీ నేతలు లేనిపోనివి చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశాలు కల్పించినట్లవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో గట్టిగా పోరాడినా ఓడిపోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినా పార్టీ ఓడిపోయింది. డీకే అరుణకు.. బీఆర్ఎస్ పార్టీ సహకరించడమే కారణం. అలాగే తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలు రేవంత్ ను గట్టెక్కించాయని అనుకోవచ్చు.
బీజేపీకి 400 సీట్లు రాకపోవడంతో
బీజేపీ అగ్రనేతలు కోరుకున్నట్లుగా నాలుగు వందల సీట్లు కేంద్రంలో వచ్చినట్లయితే రేవంత సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రేవంత్ సేఫ్ జోన్ లోకి వెళ్లారు.
తెలంగాణలో అధికార పగ్గాలు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారు. అభివృద్ధికి తగినవిదంగా మంత్రివర్గాన్ని నిర్మించుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రగతి కోసం మంత్రివర్గంతో చర్చలు. మరోవైపు అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశాలు నివహించారు సీఎం రేవంత్ రెడ్డి అదే తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డుగా నిలిచింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. వాటి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఎన్నికల కమిషన్ కూడా కోడ్ నిబంధనలను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిరంతం మంత్రులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా, సమావేశాలతో తీరిక లేకుండా ఉన్నారు.
పాలనపై ఫోకస్
ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి భాద్యతలతోపాటు పీసీసీ పగ్గాలు కూడా తన చేతిలోనే ఉన్నవి. ఇప్పుడు అయన ముందు స్థానిక సంస్థల ఎన్నికల పోరు కూడా ఉంది. అందులో పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా సీఎం పైనే ఉంది. వాటితో పాటు కార్పొరేషన్ పదవుల పంపిణీ చేసే భాద్యత కూడా ఉంది. ఈ రెండు ప్రధానమైనవి కావడంతో సీఎం దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో పలు హామీలను కూడా ఇచ్చారు. ముక్యంగా రైతు రుణమాఫీ. ఈ పథకాన్ని ఆగష్టు 15 తేదీలోగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నిధుల వేటలో మంత్రి వర్గం ఉన్నది. అదేవిధంగా కులగణన చేసి తీరుతామని కూడా హామీ ఇచ్చారు. దీనిపై ఎక్కడ కూడా తేడా రాకుండా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది.