cm revanth reddy unveils vanamahotsavam logo at warangal textile park | Warangal: వనమహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
vanamahotsavam
Political News

Warangal: వనమహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్‌లో ఆయన వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరంగల్‌లోని టెక్స్‌టైల్ పార్క్‌కు చేరిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే మొక్కలు నాటారు. వనమహోత్సవం లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహా, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, పలువురు పాల్గొన్నారు. అనంతరం టెక్స్‌టైల్ పార్క్‌ను పరిశీలించారు.

అనంతరం, కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్‌టైల్ పార్క్‌ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ఈ టెక్స్‌టైల్ పార్క్‌ కోసం భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ నుంచి వరంగల్‌కు హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరారు. గీసుకొండ మండలం శాయంపేట శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌కు ఆయన చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు.

అనంతరం, వనాల ప్రాముఖ్యత గురించి ఓ ట్వీట్ చేశారు. ‘పచ్చని చెట్టు… ప్రగతికి మెట్టు… వన మహోత్సవం… ఒక ఉద్యమంగా జరగాలి… వరంగల్ గడ్డపై… ఈ రోజు నాంది పలికిన ఈ ఉత్సవం… రాష్ట్రం మొత్తం మహా ఉద్యమంగా జరగాలి.’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పోస్టు చేశారు.

Just In

01

CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు: సీఎం రేవంత్ రెడ్డి

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

Sircilla Panchayat Elections: రెండో దశ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ముందంజ.. దరిదాపుల్లో కూడా లేని బీజేపీ!

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!