eatala rajender
Politics

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

– కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు?
– ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు
– పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి

Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారగా, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయన్నారు. తమకైతే ఏకాభిప్రాయం ఉందని, ఎందుకు ఆలస్యం అవుతుందో ఏఐసీసీ పెద్దలనే అడగాలని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అవుతున్నట్టు చెప్పారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని కేంద్ర పెద్దలకు వివరించినట్టు తెలిపారు. గతంలో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయనకు కేసీఆర్‌పైన ఇంకా ప్రేమ తగ్గలేదంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్‌ను పార్లమెంట్‌లో జీరో చేశామని, ఆ పార్టీ కోసం టార్చ్‌లైట్ పెట్టి వెతకాలంటూ చురకలంటించారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ