CM Revanth Reddy Review
Politics

CM Revanth Reddy Review : వానాకాలం.. ఏం చేద్దాం?

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ సమీక్ష
సీఎం హోదాలో ఫస్ట్‌ టైమ్

– తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి వెళ్లిన సీఎం రేవంత్
– పోలీస్, ఇతర విభాగాల అధికారులతో సమీక్ష
– వర్షాకాలానికి సంబంధించి ముందస్తు చర్యలపై చర్చ
– నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపైనా ఆరా

CM Revanth Reddy Review : వచ్చేది వర్షాకాలం. హైదరాబాద్‌లో వానలంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టాక కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆయన వెళ్లడం ఇదే తొలిసారి. సీఎంకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సెంటర్‌లోని డ్రగ్స్ కంట్రోల్ వింగ్, సైబర్ సెక్యూరిటీ వింగ్‌లను రేవంత్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమీక్షకు పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు.

అలాగే, నార్కోటిక్స్ బ్యూరో పనితీరు, సైబర్ సెక్యూరిటీ సహా పలు అంశాలపైనా సంబంధిత అధికారులతో సీఎం చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ నిర్మూలనపై సీఎం ప్రత్యేక దృష్టి సారించగా, బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలోనే మత్తు పదార్థాల బారిన యువత పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులతో సీఎం చర్చించినట్టు సమాచారం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!