CM Revanth Reddy: తన భూమి కబ్జా చేస్తున్నారని, తనకు మరో మార్గం లేక పురుగుల మందు తాగుతున్నానని, తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుకుంటూ రైతు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. పురుగుల మందు తాగడానికి ముందు రైతు భోజడ్ల ప్రభాకర్ రావు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకుంది.
సీఎం రియాక్షన్:
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతు ఆత్మహత్య ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
పంచాయితీలపై ఫోకస్:
ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీసు అధికారులను ఆదేశించారు. విచారణ జరిపి తక్షణమే నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు పొలం పంచాయితీల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పొలం పంచాయితీలపై ప్రత్యేక దృష్టి పెడతామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
ఏం జరిగింది?
ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల వీరభద్ర, భోజడ్ల ప్రభాకర్ రావుకి సుమారు ఏడెకరాల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 276,277లో ఉన్న భూమికి సంబంధించిన వివాదంలోనే ప్రభాకర్ రావు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో కొంత భూమి అదే గ్రామానికి చెందిన నాయకులు, చెరువు సొసైటీ సభ్యులు కబ్జా చేశారని ఆయన తన సెల్ఫీ వీడియోలో వివరించాడు. ఆ పొలంలో ప్రొక్లెయిన్, జేసీబీలతో మట్టిని తవ్వి తరలించేస్తున్నారని బాధపడ్డాడు. తన సమస్యను చాలా సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడని, అందుబాటులో ఉన్న నాయకులకూ చెప్పాడని, కానీ, ఫలితం లేకపోయిందని వివరించాడు. కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి తన సమస్య చెప్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సమయం గడిచిపోయిందని, కలెక్టర్ వెళ్లిపోయారని చెప్పారని ఆవేదన చెందాడు. ఇక తనకు మరో మార్గం లేదని, పురుగుల మందే శరణ్యమని భావించానని తెలిపాడు. తాను పోయినా తన కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ వీడియో సీఎం, డిప్యూటీ సీఎం వరకు చేరేలా సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.
‘Telangana Farmer Commits Suicide After Making Video’ 🚨
Just imagine how rotten the system is when a farmer believes that only his death can bring justice to his family 💔
His land was illegally encroached upon by leaders of the ruling party. After failing to get any help… pic.twitter.com/xWyGCD8tVY
— Nayini Anurag Reddy (@NAR_Handle) July 2, 2024
ప్రభాకర్ రావు పురుగుల మందు తాగాడనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు పరుగున స్పాట్‌కు వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రభాకర్‌ను హాస్పిటల్ తరలించేలోపే మరణించాడు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం కోసం ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు.